K. A. Paul: కటిక పేదరికం నుంచి సొంత విమానం వరకు.. కేఏ పాల్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

K. A. Paul: కేఏ పాల్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. కేఏ పాల్ అసలు పేరు. కిలారి ఆనంద్ పాల్. విశాఖపట్నం సమీపంలోని చిట్టివలస అనే గ్రామంలో సెప్టెంబర్ 25, 1963లో జన్మించారు. తండ్రి పేరు వెంకటరమణ.. కానీ తర్వాత బర్నబస్ గా మార్చుకున్నారు. తల్లిపేరు సంతోషమ్మ. హిందూ ఫ్యామిలీలో కేఏ పాల్ జన్మించాడు. కానీ తండ్రి బర్నబస్ తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా.. ఆస్పత్రులు తిప్పారు. కానీ ఎంత చేసినా ఆయనకు జబ్బ నయం కాలేదు. దీంతో చార్లెస్ అనే ఫాదర్ జీసస్ ని ప్రార్ధిస్తే జబ్బు నయమై కోలుకుంటారని సూచించారు. దీంతో ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో జీసస్ ను ప్రార్ధిస్తూ వచ్చారు.

తర్వాత కొద్దిరోజులకే తండ్రి బర్నబస్ కు జబ్బు నయం కావడంతో జీసస్ ను నమ్మడం మొదులుపెట్టారు. 1966లో కేఏ పాల్ ఫ్యామిలీ హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి మారింది. కానీ కేఏ పాల్ 1971లో క్రిస్టియానిటీకి ఛేంజ్ అయ్యారు. కేఏ పాల్ చాలా కటిక పేదరికం కలిగిన ఫ్యామిలీలో జన్మించారు. కేఏ పాల్ చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లి వచ్చిన తర్వాత బొగ్గులు ఎరుకుని వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను తల్లికి ఇచ్చేవారు. పదో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయిన కేఏ పాల్.. మూడసారి రాసి పాస్ అయ్యారు.

తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కేఏ పాల్.. డిగ్రీలో చేరి మధ్యలోనే మానివేశారు. కేఏ పాల్ తండ్రి బైబిల్ వ్యాఖ్యానం బాగా చెప్పేవాళ్లు. ఆయనతో పాటు కలిసి కేఏ పాల్ కూడా తిరిగేవాడు. కేఏ పాల్ తండ్రి స్పీచ్ నచ్చి ఆయనను ఆమెరికాకు కూడా ఆహ్వానించారు. అమెరికాలో తండ్రితో కలిసి కేఏ పాల్ కూడా వ్యాఖ్యనంగా చేసేవారు. ఇంగ్లీష్ పై పట్టు సాధించుకున్న ఏ పాల్ తన స్పీచ్ లతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. దీంతో ఆయన సభలకు లక్షలాది మంది జనం వస్తుండటంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

దేశ, విదేశాల్లో కేఏ పాల్ సభలకు జనాదరణ పెరగడంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. కేఏ పాల్ ను తొమ్మదిసార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసిన కేఏ పాల్.. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేవారు. ఈ సభలకు వివిధ దేశాల అధినేతలు కూడా వచ్చి సభలకు వచ్చే జనాన్ని చూసే షాక్ అయ్యేవారు. వివిధ దేశాలను అధినేతను కలుసుకుని శాంతి ఒప్పందం కూడా చేసేవారు. గ్లోబర్ పీస్ ఆర్గనైజేషన్ కు వచ్చే విరాళాల ద్వారా సొంతగా ఒక విమానాన్ని కేఏ పాల్ కొన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -