UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్నది పట్టించుకోని నీచులు సమాజంలో చాలామందే ఉన్నారు. ఎదుటి వాళ్ళ విజయాన్ని మెచ్చుకోవడానికి ఇష్టపడని ఇలాంటి సంకుచిత మనస్తత్వం కలవాళ్ళు ఎదుటి వాళ్ళ లో ఉన్న లోపాలని మాత్రం హైలెట్ చేస్తూ ఒక లాంటి శునకానందాన్ని అనుభవిస్తారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ అమ్మాయి పేరు ప్రాచీ నిగమ్. ఈమె ఇటీవల విడుదలైన ఉత్తర ప్రదేశ్ బోర్డు పదో తరగతి పరీక్షలలో 600 మార్కులకు గాను 591 మార్కులు సంపాదించి స్టేట్ టాపర్ గా నిలిచింది. అయితే ఆమె సాధించిన విజయాన్ని పక్కన పెట్టేసి ఆమె ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలని హైలెట్ చేస్తూ ఆమెని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్స్. ఆమె ఫోటోని ఎడిటింగ్ చేసి నానా రకాలుగా కామెంట్లు చేశారు.

వాళ్ల శునకానందం వాళ్ళదే కానీ వాళ్ళ పనుల వల్ల ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లుతుందో అనే ఆలోచన కూడా చేయకపోవడం విచారకరం. నిజానికి స్టేట్ ఫస్ట్ రావటం అనేది మాటలు కాదు, ఆమె ఎంత కష్టపడితే స్టేట్ ఫస్ట్ వచ్చి ఉంటుంది అనే కోణాన్ని పక్కనపెట్టి ఆమెని బాడీ షేవింగ్ కి గురి చేయటం నిజంగా దారుణం. ఇలాంటి ట్రోలింగ్స్ చూసినప్పుడు సమాజం ఎటువైపు వెళుతుంది అనే అనుమానం కలగక మానదు.

అయితే ఆనందించవలసిన విషయం ఏమిటంటే ఆమెని సపోర్ట్ చేస్తూ మరొక వర్గం సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. కోసమేరుపు ఏమిటంటే ఇంత జరుగుతున్నా ప్రాచీనిగమ్ ఈ విషయంపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు అసలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎంతో హుందాగా ప్రవర్తించింది, ఆమె కుటుంబం కూడా సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లోనే దృష్టి పెట్టింది కానీ ఈ ట్రోలింగ్ పై ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -