Anushtha Kalia: ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు లక్ష్యాన్ని సాధించిన యువతి.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

Anushtha Kalia: ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు లక్ష్యాన్ని సాధించడం సులువు కాదు. అయితే ఒక యువతి మాత్రం ఎంతో కష్టపడి తన కలను నెరవేర్చుకున్నారు. అనుష్తా కాలియా సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపడంలో ఎంతోమందిని గర్వపడేలా చేస్తోంది. పీజీ చదువుతూనే ఐపీఎస్ సాధించిన ఈ యువతి తన సక్సెస్ స్టోరీతో ప్రశంసలు అందుకుంటున్నారు. నా విద్యాభ్యాసం ఢిల్లీలో సాగిందని ఆమె తెలిపారు.

ఐటీలో నేను బీటెక్ పూర్తి చేశానని ఆమె కామెంట్లు చేశారు. ఆ తర్వాత డేటా సైంటిస్ట్ గా జాబ్ చేరి మెషిన్ లర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో పని చేశానని ఆమె చెప్పుకొచ్చారు. పీజీ కోసం సైకాలజీని ఎంచుకున్నానని అనుష్తా కాలియా కామెంట్లు చేశారు. ఇండోర్, ఔట్ డోర్ లో శిక్షణలో చాలా కష్టపడ్డానని అనుష్తా కాలియా కామెంట్లు చేశారు. నెలరోజుల జంగిల్ వార్ ఫేర్ శిక్షణలో భాగంగా అడవిలో ఉన్నానని అనుష్తా కాలియా వెల్లడించారు.

శిక్షణ మొత్తంలో అది నాకు చాలా క్లిష్టమైన సమయం అని అనుష్తా కాలియా అన్నారు. శిక్షణ సమయంలో రోజువారీ షెడ్యూల్ తీరిక లేకుండా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. సాయంత్రం కొంత సమయం లభించేదని ఆ సమయాన్ని వదలకుండా నేను ఎంతో కష్టపడ్డానని అనుష్తా కాలియా పేర్కొన్నారు. శిక్షణ సమయంలో బెస్ట్ ఔట్ డోర్ ప్రొబేషనర్ గా ఎంపికయ్యానని ఆమె తెలిపారు.

నాకు ది ఐపీఎస్ ఆఫీసర్స్ స్క్వార్డ్ ఆఫ్ హానర్ దక్కిందని ఆమె తెలిపారు. నేను దీక్షాంత్ పరేడ్ కు కమాండర్ గా కూడా పని చేయనున్నానని అనుష్తా కాలియా అన్నారు. పోలీస్ వృత్తి విషయంలో మహిళల్లో చాలా అపోహలు ఉన్నాయని కానీ మహిళల సమస్యలు తోటి మహిళలకే అర్థమవుతాయని ఆమె కామెంట్లు చేశారు. అనుష్తా కాలియా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -