US: కారు నంబర్‌తో బెట్‌.. లాటరీలో ఎంత గెలుచుకుందో తెలుసా?

US: అదృష్టం ఎవరికి ఎప్పుడు వరిస్తోందో.. ఎక్కడి నుంచి వస్తోందో ఎవరూ ఊహించలేము. కటిక బీదరికంలో ఉన్న వాళ్లు కూడా కొన్ని గంటల వ్యవధిలో కోటీశ్వరులు అవుతారు. వారికి కూడా తెలియదు మేం ఇలా అయ్యామా అని. చిన్న చిన్న లక్‌లే వారికి అపార భగీరథులు చేస్తాయి.అదృష్టం మన వెంట ఉంటే మనం ఏది పట్టినా బంగారం అయిపోతుంది. చీపురు పుల్లతో బంగారు గని తవ్వవచ్చు. బంజరు భూమిలో వజ్రాలు పండించవచ్చనే సమేతు ఉన్నాయి.

ఇలాంటి అదృష్టమే ఓ మహిళను వరించింది. కారు నెంబర్‌ ప్లేటుపై ఉన్న నెంబర్లతో బెట్టింగ్‌ వేయగా రూ. 40 లక్షల లాటరీ తగిలిన ఆశ్చర్యకర ఘటన అమెరికాలో జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాకు చెందిన 43 ఏళ్ల ఓ మహిళకు లాటరీలంటే చాలా ఆసక్తి. కొద్దిరోజుల క్రితం ఆమె మేరీల్యాండ్‌ లాటరీ ఆడింది. ఇందుకోసం ‘పిక్‌ 5’ లాటరీని తీసుకుంది. తన పాత కారు నెంబర్‌ ప్లేటుపై ఉన్న నెంబర్లను 1 డాలర్‌ బెట్‌ కింద వేయగా కారు నెంబర్‌కే లాటరీ తగిలి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 వేల డాలర్లు వచ్చాయి. మన భారతీయ కరెన్సీలో అయితే 39.85 లక్షల రూపాయలు అన్నమాట.

లాటరీ గెలవటంపై సదరు మహిళ ఎగిరి గెంతేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐదు నెంబర్ల లాటరీని తానను ఎప్పుడూ గెలుస్తానని అనుకోలేదని లాటరీ ద్వారా వచ్చిన డబ్బులతో తనకున్న అప్పులు తీరుస్తా.. కొత్త కారుకు ఉన్న రిపేర్లు చేయిస్తానని అన్నారు. తన పిల్లల్ని, మనవరాలిని బాగా చూసుకుంటానని చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -