Type 1 Diabetes: డయాబెటిస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్.. ఈ వ్యాక్సిన్ తో ఆ సమస్యలకు సులభంగా చెక్!

Type 1 Diabetes: ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ ని ఉపయోగించడంతోపాటు వంటింటి చిట్కాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ షుగర్ వ్యాధి వచ్చింది అంటే చాలు. ఎన్ని రకాల మెడిసిన్స్ ఉపయోగించిన కూడా పోదు. కానీ ఈ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి మాత్రమే ఎన్నో రకాల మెడిసిన్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే మార్కెట్లో మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా లభిస్తూ ఉంటాయి.

ఈ ఆయుర్వేద మందు ఉపయోగిస్తే చాలు షుగర్ మాయం మళ్లీ జన్మలో రాదు అంటూ ఇలా రకరకాల ఫేక్ న్యూస్ ని సృష్టిస్తూ ఉంటారు. కానీ అవన్నీ వట్టి రూమర్సే. ఎందుకంటే షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే మళ్లీ పోదు. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా సోషల్ మీడియాలో డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టె వ్యాక్సిన్ వచ్చేసింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మల్టిపుల్‌ స్లీరోసిస్‌, టైప్‌-1 మధుమేహం వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధుల ఆట కట్టించే దిశగా సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లను శత్రువులుగా గుర్తించి, వాటిపై దాడి చేయడాన్ని రోగ నిరోధక వ్యవస్థకు సాధారణ టీకాలు నేర్పిస్తాయి. అందుకు భిన్నంగా ప్రత్యేక విలోమ వ్యాక్సిన్‌ను అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రిట్జ్‌కర్‌ స్కూల్‌ ఆఫ్‌ మాలిక్యులార్‌ ఇంజినీరింగ్‌ పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. కొన్ని నిర్దిష్ట కణాలకు సంబంధించి రోగ నిరోధక వ్యవస్థ జ్ఞాపకశక్తిని ఈ టీకా చెరిపేస్తుంది. టైప్‌-1 మధుమేహం, మల్టిపుల్‌ స్లీరోసిస్‌ వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధుల్లో రోగ నిరోధక వ్యవస్థ ఆయా వ్యక్తుల ఆరోగ్యకర కణజాలంపై దాడి చేస్తుంది. సంబంధిత జ్ఞాపకశక్తిని కొత్త వ్యాక్సిన్‌ చెరిపేస్తుంది కాబట్టి ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -