Nothing Phone: తక్కువ ధరకే నథింగ్ ఫోన్ ను పొందాలా.. ఏం చేయాలంటే?

Nothing Phone: బ్రిటన్ కు చెందిన నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే ఎన్నో రకాల ఆకర్షణీయమైన అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోని తాజాగా గుడ్ ఫ్రైడే సందర్భంగా మరో సరికొత్త ఆఫర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్ ఫోన్ 1 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

యూకే ఆధారిత కార్ల్ పీ నేతృత్వంలోని వినియోగదారు టెక్ కంపెనీ త్వరలో నథింగ్ ఫోన్ 2 ని లాంచ్ చేయబోతున్న సందర్భంగా ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. నథింగ్ ఫోన్ 1గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 1,500కే మాత్రమే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 1 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో గుడ్ ఫ్రైడే రోజున రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 29,999కి లిస్ట్ చేయబడింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే స్మార్ట్‌ ఫోన్ ధర రూ.28,500కి తగ్గింది.

దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ. 27,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా నథింగ్ ఫోన్ 1ధరను రూ. 1,500కి దిగొచ్చింది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ లు ఫీచర్ల విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ 1లాంచింగ్‌ ప్రైస్‌. రూ. 32,999 గా ఉంది. ఈ నథింగ్ ఫోన్ 1 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.55 అంగుళాల OLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ 120Hz రిఫ్రెష్ రేట్‌, Qualcomm Snapdragon 778జీ చిప్‌సెట్ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 50ఎంపీ రియర్‌ డ్యూయల్ కెమెరా సెటప్‌ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా తో లభించనుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ సామర్థ్యం ని కలిగి ఉండడం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -