Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ ప్రాణాలు పోవడానికి ఆ తప్పే కారణమైందా?

Aarthi Agarwal: నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆర్తి అగర్వాల్ ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె కోసమే ఆ సినిమాని మళ్లీ మళ్లీ చూసిన ప్రేక్షకులు ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు. 58 కేంద్రాల్లో వంద రోజులు ఆడి రికార్డు సృష్టించింది ఈ సినిమా. వస్తూ వస్తూనే సునామీ సృష్టించిన ఈ భామ అమెరికాలోని న్యూ జెర్సీలో 1984 మార్చ్ ఐదు న జన్మించింది.

ఈమె సినీ రంగ ప్రవేశం అమితాబచ్చన్ వల్ల జరిగిందని చెప్పొచ్చు. పిల్లడెలిపియాలోని ఒక స్టేషలో ఆర్తి అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబచ్చన్ ఆమెని హిందీలో యాక్ట్ చేయటానికి ఎంకరేజ్ చేశాడంట. అలా ఆమె 2001లో హిందీ సినిమా పాగల్ అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో నువ్వు నాకు నచ్చావు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరియర్ పీక్స్ లోకి వెళ్ళింది.

 

విషాదం ఏమిటంటే ఆమె కెరియర్ పీక్స్ లో ఉండగానే అర్ధాంతరంగా మరణించింది. అంతకుముందు హీరో తరుణ్ తో ప్రేమాయణం సాగించిన ఈ భామ ఆ ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో అప్పట్లో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆమె 2007లో తస్వల్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకున్నారు. ఆ వివాహం కూడా విఫలం కావడంతో పూర్తిగా డిప్రెషన్ కి గురై బాగా బరువు పెరిగిపోయారు.

 

పైగా ఆమెకి సిగరెట్లు తాగే అలవాటు కూడా విపరీతంగా ఉందని సమాచారం. బరువు తగ్గటానికి ఆమె ఆపరేషన్ చేయించుకునే సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో ఆమె మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె మృతికి ఆపరేషన్ చేయించుకోవటమా, ఆమె ఫేస్ చేసిన ఫెయిల్యూర్సా లేకపోతే ఆమెకి ఉన్న సిగరెట్లు తాగే అలవాటా? కారణం ఏదైనాప్పటికీ ఒక దృవతార అకారణంగా నేల రాలిపోయింది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -