Isro Somnath: ఇక చంద్రుడిపైకి మనిషిని పంపిస్తాం.. ఇస్రో సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Isro Somnath: చంద్రయాన్ 3 చందమామ మీద అడుగు పెట్టిన వేళా విశేషం భారతదేశ గౌరవం ప్రపంచ స్థాయికి చేరింది. అయితే దీని గురించి ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 చంద్రుని యొక్క సౌత్ పోల్ లో సేఫ్ల్యాండ్ అయిందని, దీనికోసం వాళ్లు చాలా కష్టపడ్డారని తెలిపారు. ఇది ఒకరి విజయం కాదు. అందరి విజయం. ప్రతి భారతీయుడికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను.

అలాగే మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ దేశాల్లోనే మూన్ సౌత్ పోల్ లోని ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం మనదే. దీనికి మనం ఎంతో గర్వపడాలి. అలాగే మేము ఇక్కడితో ఆపాలనుకోవట్లేదు. మాకు ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి. మనిషి చందమామ మీద అడుగు పెట్టేలా చేస్తాము. అలాగే మరెన్నో పరిశోధనలకు ఇది దారితీస్తుంది అని పేర్కొన్నారు.

 

భారతదేశం చందమామ మీద అడుగుపెట్టిన నాలుగోవ దేశం. అంతకన్నా ముందు రష్యా, చైనా వంటి దేశాలు ఉన్నాయి.అయితే దక్షిణ భాగంలో అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం మనదే. చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన తర్వాత 2019 నుంచి 2023 వరకు చాలా కష్టపడి దీన్ని లాంచ్ చేశారు. భారతదేశ ప్రజల అందరి ఆశలు దీని మీద ఉన్నాయి. ఇది సక్సెస్ కావడంతో భారతదేశ పతాకం చందమామ దక్షిణ భాగంలో మొట్టమొదటిసారిగా ఎగరనున్నది.

 

చంద్రయాన్ 3 అక్కడ ల్యాండ్ అయిన తర్వాత 14 రోజులపాటు సర్వేలు చేస్తుంది. దానికోసం మేము ఎదురు చూస్తున్నాము అని సోమనాథ్ తెలిపారు. దీనికోసం నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ ఇస్రో కి అలాగే భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 చంద్రుడి మీద ల్యాండ్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీయగా వాటిని ఇస్రో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. ఇవి వైరల్ గా మారి హల్చల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -