Papaya Seeds: బొప్పాయి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Papaya Seeds: బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బొప్పాయిలో విటమిన్ ఏ,బి,సి,ఈ, కాల్షియం, జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఆంటీ యాక్సిడెంట్ , ఫైబర్ ఇలా ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బొప్పాయిలో ఉండే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ గుండెకు సంబందించిన సమస్యలను దూరం చేస్తాయి. కేవలం బొప్పాయి మాత్రమే కాకుండా బొప్పాయి విత్తనాల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

బొప్పాయి గింజల్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇవి జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము కాల్షియంతో సహా అనేక విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. బొప్పాయి గింజలు మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫ్లేవనాయిడ్‌లను కలిగి ఉంటాయి. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. బొప్పాయి గింజల బొప్పాయి గింజల్లో పైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో మీరు వైట్ లాస్ అవుతారు.

 

బొప్పాయి గింజల్లో కార్పెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ప్రేగులను క్లీన్ చేస్తుంది. దీంతో మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్య దరిచేరదు. బొప్పాయి గింజల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. ఒలీక్ యాసిడ్ మరియు ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మీ శరీరాన్ని అనేక రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతుంది. బొప్పాయి గింజల్లో విటమిన్ సి ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -