Google Pay: కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన గూగుల్ పే.. ఏమైందంటే?

Google Pay: ప్రస్తుతం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటంతో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలా ఆన్లైన్లో వీటి ద్వారా చెల్లింపులు చేయటం వల్ల అనేక ప్రయోజనాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మనం డబ్బును ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పొరపాటున కనుక ఇతరుల నెంబర్లకు ట్రాన్స్ఫర్ చేస్తే తిరిగి ఆ డబ్బును పొందటానికి చాలా కష్టతరంగా అవుతుంది అందుకే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలని చెబుతుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా గూగుల్ పే తన వినియోగదారులకు ఒక శుభవార్త తెలియజేసింది. ఇటీవల కొంతమంది గూగుల్ పే వినియోగదారులకు అధిక మొత్తంలో డబ్బు క్రెడిట్ అయింది. కొంతమంది వినియోగదారుల అకౌంట్లోకి దాదాపు రూ. 80000 క్రెడిట్ అయ్యింది. అయితే గూగుల్ పే ఈ పొరపాటున వెంటనే గ్రహించే సాధ్యమైనంత వరకు కస్టమర్ల నుండి డబ్బు వెనక్కి రాబట్టింది. అయితే సాంకేతిక లోపం వల్ల ఈ పొరపాటు జరిగి ఉండవచ్చునని అందరూ భావిస్తున్నారు.

ముఖ్యంగా వినియోగదారులు ‘ డాగ్ ఫుడ్డింగ్ ‘ అనే ఫీచర్ పరిశీలిస్తున్న సమయంలో ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. కొత్త ఫీచర్ టెస్టింగ్ సందర్భంగా గూగుల్ పే తన ఉద్యోగస్తులకు బదులు వినియోగదారులకు డబ్బు చెల్లించినట్లు సమాచారం.
ఈ పొరపాటు జరిగిన వెంటనే గూగుల్ పే మెయిల్ ద్వారా యూజర్లను సంప్రదించి వీలైనంత వెనక్కి రాబట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఒకవేళ పొరపాటున ఆ డబ్బుని యూజర్లు వాడేసినా లేదా ఇతరుల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని గూగుల్ పే క్లారిటీ ఇస్తూ యూజర్స్ కి శుభవార్త తెలిపింది. దీంతో గూగుల్ పే యూజర్స్ అకౌంట్లో కూడా పొరపాటున డబ్బు క్రెడిట్ అయ్యిందేమో అని వారి అకౌంట్ చెక్ చేస్తున్నారు. మీ గూగుల్ పే అకౌంట్ లో కూడా డబ్బు క్రెడిట్ అయ్యిందేమో ఒకసారి చెక్ చేసుకోండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -