Peddapalli: గుండెపోటుతో మృతి చెందిన సోదరుడి చేతికి రాఖీ కట్టిన సోదరి.. ఏం జరిగిందంటే?

Peddapalli: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి నిదర్శనం ఈ అన్నా చెల్లెళ్ల సంఘటన. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. అందరిలాగానే ఈ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వెళ్ళింది. అయితే అనుకోని రీతిలో కన్నీళ్ల మధ్య చనిపోయిన అన్నకి రాఖీ కట్టింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో జరిగింది.

అన్నాచెల్లెళ్ల మధ్య సంతోషాన్ని నింపవలసిన రాఖీ పండుగ ఆ చెల్లెలి జీవితంలో విషాదాన్ని మిగిల్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాఖీ పండుగ సందర్భంగా కనకయ్య సోదరీ గౌరమ్మ అన్న ఇంటికి వచ్చింది. సోదరుడికి రాఖీ కడదామని వచ్చింది కానీ అన్న హఠాత్ మరణంతో గుండెలవిసేలాగా రోధించింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న అన్న ఒక్కసారిగా విగత జీవిగా మారడం తట్టుకోలేకపోయింది.

 

గుండెపోటుతో తోడబుట్టినవాడు కుప్ప కూలిపోవడంతో కన్నీటి పర్యంతమైంది గౌరమ్మ. తీవ్ర దుఃఖంతోనే సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టింది. ఆ చెల్లెలికి వచ్చిన కష్టాన్ని చూసి గ్రామస్తుల సైతం కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూసినవాళ్ళని సైతం కన్నీరు పెట్టిస్తోంది. అప్పటివరకు తమ మధ్యనే తిరిగిన తన అన్న ఒక్కసారిగా గుండెపోటుతో చనిపోవడంతో ఆ చెల్లెల్ని పట్టుకోవడం గ్రామస్తుల తరం కాలేదు.

 

ఆనందంగా పుట్టింటికి వచ్చిన ఆ చెల్లెలికి ఇదే చివరి రాఖి అవుతుందని ఊహించి ఉండరు ఆ అన్నా చెల్లెళ్ళు. అయినా ఈ మధ్యకాలంలో హఠాత్తుగా, వయసు తో సంబంధం లేకుండా గుండెపోటులు రావటం, వెంటవెంటనే చనిపోవడం తరచుగా జరుగుతూనే ఉన్నాయి. సెలబ్రిటీలు సైతం ఈ మధ్య ఇలాగే చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మారుతున్న జీవనశైలి ఇందుకు కారణం అంటున్నారు వైద్య నిపుణులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -