Garuda Purana: అత్యాచారం చేసిన వాళ్ళకి గరుడ పురాణంలో విధించే శిక్షలివే?

Garuda Purana: రోజురోజుకీ మానవ మృగాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోడ్డుపై ఆడది కనిపించింది అంటే చాలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. ఆఖరికి మానసిక వికలాంగులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.. ప్రభుత్వం సరైన చట్టాలు తీసుకురాకపోవడంతో కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇటువంటి వారిని పైనున్న ఆ దేవుడే శిక్షించాలి అని అంటూ ఉంటారు. అందుకే చట్టాలు వదిలిపెట్టినా పైవాడు వదిలేదే లే.

లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డే వారికి గరుడ పురాణం ప్రకారం దారుణమైన శిక్షలు ఉన్నాయి. మరి ఆ శిక్షలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుయోద‌కం.. పురుషులు లేదా స్త్రీలు ఎవ‌రైనా ఎవరినీ అయినా అత్యాచారం చేసినా, లైంగికంగా వేధించినా నరకంలో విధించే శిక్ష ఇది. ఒక పెద్ద బావిలో మ‌లం, మూత్రం, ర‌క్తం, శ్లేష్మం నింపి అందులో ఆ వ్య‌క్తుల‌ను ప‌డేస్తారు. వాళ్లు ఎప్పటికీ ఆ బావిలోనే ఉండిపోవడమే. మరో శిక్ష స‌ల్మ‌లి.. వివాహేత‌ర సంబంధాలు పెట్టుకునే స్త్రీ, పురుషుల‌కు న‌ర‌కంలో య‌మభ‌టులు విధించే శిక్ష సల్మలి.

 

బాగా వేడి చేసిన ఒక ఇనుప స్తంభాన్ని నగ్నంగా కౌగిలించుకోమని చెప్పి యమభటులు కొరడాలతో కొడుతూ ఉంటారు. మరో శిక్ష వ‌జ్ర‌కంఠక‌స‌లి.. లైంగిక వాంఛ తీర్చుకునేందుకు జంతువులను కూడా వదలని దుర్మార్గులు కూడా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు నరకంలో విధించే శిక్ష వజ్రకంఠసలి. సూదుల్లాంటి పెద్ద పెద్ద లోహాలను శరీరంలోకి గుచ్చి వారిని గాలిలో వేలాడదీసి శరీరాన్ని ఛిద్రం చేస్తారు. ల‌లాభక్షం.. స్త్రీల‌ను కామంతో చూసే వారికి న‌ర‌కంలో విధించే శిక్ష లలాభక్షం. కుళ్లిపోయిన వీర్యంతో నిండిన స‌ముద్రంలో పాపుల‌ను ప‌డేసి ఎప్ప‌టికీ అందులోనే ఉంచుతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -