Ratan Tata – Shantanu Naidu : 84 ఏళ్ళ రతన్ టాటాకు శాంతన్ అంటే ఎందుకంత ఇష్టం?

Ratan Tata – Shantanu Naidu : రతన్ టాటా.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన భారతదేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా సుపరిచితమే. రతన్ టాటా ఇటీవలే తన 84వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈసారి రతన్ టాటా కు జరిగిన పుట్టినరోజు కాస్త ప్రత్యేకం. ఎందుకంటే రతన్ టాటా ఈసారి తన బర్త్డే సందర్భంగా తన స్నేహితుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే రతన్ టాటా పరిచయం చేసింది ఒక ప్రముఖ వ్యాపారవేతను అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆయన స్నేహితుడు 28 ఏళ్ల కుర్రాడు. 84 ఏళ్ల వ్యాపారవేత రతన్ టాటాకు 28 వేల కుర్రాడితో స్నేహమా ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.

రతన్ టాటా పరిచయం పరిచయం చేసిన ఆ 28 ఏళ్ల కుర్రాడు పేరు శాంతను నాయుడు. ఆ కుర్రాడు రతన్ భుజం మీద చేయి వేసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ ఫోటోను చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రతన్ టాటా ను కావాలి అంటేనే చూడాలి అన్న అపాయింట్మెంట్ కావాలి. అటువంటిది ఏకంగా ఆయన భుజంపై చెయ్యి వేసిన ఆ కుర్రాడు ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. 28 ఏళ్ళ శాంతను నాయుడు.. టాటా సంస్థల్లోని ఓ ఉద్యోగి. 2014లో ముంబైలోని టాటా ఎల్క్సీలో ఆటో మొబైల్ డిజైన్ ఇంజనీర్ గా చేరాడట.

అయితే ఒక రోజు రోడ్డు ప్రమాదంలో ఓ శునకం మరణించడం శాంతాను ను బాధేసిందట. ఆ ప్రదేశమంతా రక్తంతో కనిపించడంతో శాంతాను మనసుకు బాధ వేసి అలా మరోసారి వీధి కుక్కను ఇలాంటి భయంకరంగా చూడొద్దని అనుకున్నాడట. ఇందుకోసం వీధుల్లో తిరిగే శునకాలను ప్రమాదాల నుంచి తప్పించడం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి గ్లో ఇన్ ది డార్క్ కాలర్స్ అని పిలిచే డాగ్ కాలర్ ను సృష్టించాడు. అంటే వీధి కుక్కల మెడలకు రాత్రి పూట మెరిసే కాలర్లను వేయడం అన్నమాట. ఇది కుక్కల మెడకు ఉండడంతో డ్రైవర్లకు సుదూరంగా ఉన్నట్లుగానే దానిని గుర్తించవచ్చు. అయితే కార్యక్రమాన్ని నిర్వహించడానికి అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు రతన్ టాటాకు లేఖ రాశాడు. ఆ లేఖ పై వెంటనే స్పందించిన రతన్ టాటా, శాంతాను నీ ఒక సమావేశానికి రమ్మని చెప్పి ఆహ్వానించాడట. ఆ లేఖ తనను తీవ్రంగా కలిసి వేసిందని, ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం కోసం నిధులు సమకూర్చారు రతన్.ఆ విధంగా శాంతాను,రతన్ టాటా మధ్య స్నేహం కుదిరింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -