Arya Parvathy: తల్లి గర్భవతి అయితే నాకెందుకు సిగ్గు.. నటి కామెంట్స్ వైరల్!

Arya Parvathy: మలయాళ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ఆర్య పార్వతి ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె తన తల్లి ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. తన తల్లి 47 సంవత్సరాల వయసులో మరోసారి గర్భం దాల్చి మరొక చిన్నారికి జన్మనివ్వడంతో ఒక్కసారిగా నటి ఆర్య పార్వతి వార్తల్లో నిలిచారు. తాను 23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి మరొక బిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారింది.

ఇక ఈ విషయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి ఆర్యా పార్వతి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మా అమ్మకు 47 సంవత్సరాల వయసులో ప్రెగ్నెన్సీ వచ్చిందని విషయాన్ని మా నాన్న ద్వారా తెలుసుకున్నానని ఈమె తెలియజేశారు. అయితే అప్పటికే అమ్మకు ఎనిమిదవ నెల ప్రెగ్నెన్సీ అని తెలియజేశారు. ఆ సమయంలో తాను ఎలా స్పందించాలో తనకు అర్థం కాలేదని తెలిపారు.

 

23 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక కూతురు తన తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వార్త వింటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక నేను కూడా ఈ వార్త విని షాక్ అయ్యానని ఈమె తెలిపారు.అయితే ఈ విషయాన్ని నాకు చెబితే నేను ఎలా రిసీవ్ చేసుకుంటానో అని నా తల్లిదండ్రులు భయపడ్డారు. అందుకే ఈ విషయాన్ని నాకు చెప్పలేదని ఈమె వెల్లడించారు.

 

ఈ విధంగా నాన్న తన తల్లి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడంతో వినడానికి కాస్త ఇబ్బంది అనిపించిన ఇందులో ఏ మాత్రం తప్పు లేదని ఈమె తెలిపారు. ఇక ఈ విషయం తెలియగానే నేను వెంటనే వెళ్లి అమ్మ ఒడిలో తలవాల్చుకొని పడుకున్నానని తెలిపారు.. ఎందుకంటే ఈ శుభవార్త కోసం తాను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను. ఇక తాను ఎందుకు సిగ్గుపడతాను అంటూ తాను తన తల్లితో చెప్పానంటూ ఈ సందర్భంగా ఆర్య పార్వతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -