Ravi Prakash: టీవీ9 రవిప్రకాష్ కొత్త ఛానెల్ ఓపెనింగ్ ఆలస్యం కావడానికి అసలు కారణమిదా?

టీవీ9 రవి ప్రకాష్ గురించి మనందరికి తెలిసిందే. ఆయన టీవీ9 ద్వారా ఎంత పాపులారిటి సంపాదించుకున్నారో మనందరికి తెలిసిందే. రవిప్రకాష్ అంటేనే టీవీ9, టీవీ9 అంటే రవిప్రకాష్ అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ9లో పనిచేసే కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. రవిప్రకాష్ టీవీ9 ఫౌండర్ సీఈఓగా 24X7 న్యూస్ ఛానల్ ను స్థాపించి న్యూస్ ఛానల్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన విషయం తెలిసింది. అంతేకాకుండా టిఆర్పీలు అనే పదాన్ని కూడా బాగా పాపులర్ చేసాడు.

దానికోసమే మిగతావారు పాకులాడేలా చేసాడు. అందుకే రవిప్రకాష్ మీడియాలో అత్యంత విజయవంతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఇప్పటికీ తెలుగు న్యూస్ రంగం ఇదే టెంప్లేట్ ను అవలంబిస్తోంది. అయితే టీవీ9 మానేజ్మెంట్ లో మార్పు వచ్చాక నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారు. అలాగే అతను కేసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో రవిప్రకాష్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పటి నుండో కొత్త ఛానల్ ప్రారంభించాలి అన్న ఉద్దేశంలో ఉన్న విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వం న్యూస్ ఛానెల్‌లకు కొత్త లైసెన్సులను ఇవ్వడం ఆపేసిన కారణంగా, అతను ఇప్పటికే ఉన్న అంత పాపులర్ కాని రాయుడు టీవీ ఛానెల్‌ని కొనుగోలు చేసి దాన్ని RTVగా మార్చి మళ్ళీ మార్కెట్ లోకి రావాలని ప్రయత్నాలు చేసాడు.

RTV అంటే రవిప్రకాష్ టీవీ అనే అర్ధం కూడా వస్తుంది. కాబట్టి పెర్ఫెక్ట్ ప్లాన్ గా భావించాడు. ఇక ఛానల్ సాఫ్ట్ రన్ ను యూట్యూబ్ లో మొదలుపెట్టాడు. మీడియా వ్యక్తులను రిక్రూట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసాడు. సరిగ్గా అప్పుడే రిపబ్లిక్ టీవీ వల్ల రవిప్రకాష్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. రిపబ్లిక్ టీవీ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసును దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. రిపబ్లిక్ టీవీఅలాగే RTV నుండి 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనికి బదులుగా రవిప్రకాష్ RTV లోగో 2007 నుండి వాడుకలో ఉందని 2016లో రిపబ్లిక్ టీవీ వచ్చిందని కౌంటర్ దాఖలు చేసింది.

లోగో వినియోగంపై అత్యవసరంగా స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానెల్ చేసిన మధ్యంతర పిటిషన్‌ను ముంబై హైకోర్టు ఈ వారం ప్రారంభంలో కొట్టివేసింది. ఈ కేసు గొడవల కారణంగా RTV ప్రారంభం అనేది ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా వినిపిస్తోన్న రూమర్ల ప్రకారం టీవీ9 ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి RTVకు లైసెన్స్ లేట్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమస్యలు అన్నీ తొలగి, రవిప్రకాష్ తాను అనుకున్నట్లు కొత్త ఛానల్ ను వచ్చే ఎన్నికల లోపులో మొదలుపెడతాడేమో చూడాలి మరి. కొత్త ఛానల్ తో రవి ప్రకాష్ ముందుకు రావాలి అనుకుంటున్న కొద్ది అతనికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -