Durgadevi: దుర్గాదేవిని ఈ 9 రకాల పూలతో పూజిస్తే అనుకూల ఫలితాలు.. ఎలా పూజించాలంటే?

Durgadevi: పువ్వులతో స్త్రీ శక్తి దేవతలని ఆరాధించే వారికి అమ్మ కరుణా త్వరగా లభిస్తుందని పెద్దలు చెప్తారు. చాలామంది పువ్వులు లేకుండా పూజ చేయడానికి ఇష్టపడరు. అయితే నవరాత్రులలో అమ్మవారిని ఏ పువ్వులతో పూజ చేయాలి ఏ రోజు ఏ పువ్వుతో పూజ చేయాలి అనేది తెలుసుకుందాం. ఉత్తరాది వైపు అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రగా అలంకరించి పూజ చేస్తారు. ఈ అమ్మవారిని మందార పూలతో పూజించాలి.

మందార పూలతో పాటు నెయ్యి కూడా సమర్పిస్తే అది శైలపుత్రి కి మరింత ప్రీతిపాత్రం. అలాగే రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారినిగా అలంకరిస్తారు. ఈ అమ్మవారికి చామంతి పూలతో పూజ చేయాలి. మూడో రోజు దుర్గాదేవిని చంద్రగంట అలంకారంలో పూజిస్తారు.ఈ దేవతకు తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇలా చేయడం వలన అమ్మవారు మీకు సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు.

 

అలాగే నాలుగవ రోజు అమ్మవారిని కుష్మాండ అవతారంలో పూజిస్తారు. ఈమెకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కుష్మాండ దేవికి మల్లెపూలను సమర్పించడం వలన తెలివి, బలం, శక్తి లభిస్తుంది. ఐదో రోజున అమ్మవారిని స్కందమాతగా అలంకరిస్తారు. ఈమెకి పసుపు గులాబీలు చాలా ఇష్టం. అమ్మవారికి ఈ పూలను సమర్పించడం వల్ల జీవితంలో శాంతి లభిస్తుంది. అలాగే ఆరవ రోజు అమ్మవారిని కాత్యాయని మాతగా ఆరాధిస్తారు.

 

ఆమెకు బంతిపూలు అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఆ పువ్వులు దొరకకపోతే పసుపు మల్లెలను ఉపయోగించవచ్చు. ఇక ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రి దుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ సమయంలో అమ్మవారికి కృష్ణ కమల్ పువ్వులతో పూజించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఒత్తిడి లేకుండా పోతుంది. 8వ రోజు అమ్మవారిని మహా గౌరీ రూపంలో పూజిస్తారు. ఈమెకి అరేబియన్ జాస్మిన్ గా పిలవబడే మొగ్గ పువ్వులని సమర్పించాలి.ఇక ఆఖరి అవతారం సిద్ధి ధాత్రి. ఈ దేవతను చంపాపూలతో పూజిస్తే వివేకం, శక్తి, బలం మీకు లభిస్తాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -