Weekend Releses: ఈవారం థియేటర్లలో, ఓటీటీలో హడావిడి చేయబోయే సినిమాలు ఇవే!

Weekend Releses: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా చాలా సినిమాలు బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా ఇలా అన్ని సినిమాలు దసరా రోజున విడుదల చేస్తే కొన్ని సినిమాలకు ప్రేక్షక ఆదరణ దక్కదు. కాబట్టి ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాలు ఈవారం థియేటర్లలో ఓటీటీ లో విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు మనం వాటి వివరాలు తెలుసుకుందాం.

కృష్ణవింద విహారి: నాగశౌర్య, షేర్లీ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

అల్లూరి: శ్రీ విష్ణు, కయాద్ లోహర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా లో తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దొంగలున్నారు జాగ్రత్త: సింహ కోడూరి , సముద్ర ఖని, ప్రీతి అస్రాని లు ఈ సినిమాలో కీలక పాత్రలో వహిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా మాతృదేవోభవ, పగ పగ పగ అనే సినిమాలు కూడా ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇక ఓటీటీ విషయానికొస్తే ద పెర్ఫ్యూమర్ అనే హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 21న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. అదేవిధంగా జంతర అనే హిందీ సిరీస్ కూడా సెప్టెంబర్ 23న విడుదల కాబోతుంది. ఇక ఎల్ వో యు అనే హాలీవుడ్ సినిమా కూడా ఈనెల 23న ఓటీటీ లో విడుదలవుతుంది.

ఇక అందోర్ అనే వెబ్ సిరీస్ సెప్టెంబర్ 21న డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో విడుదల కాబోతుంది. ద కర్దాషియన్స్ అనే వెబ్ సిరీస్ కూడా త్వరలో విడుదల కాబోతుంది. ఇక బబ్లీ బౌన్సర్ అనే సినిమా తెలుగులో సెప్టెంబర్ 23న ప్రసారమవుతుంది.

ఇక ఆహా లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా టాలీవుడ్ మూవీ అయినటువంటి డైరీ సినిమా కూడా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక డ్యూడ్ అనే హిందీ సిరీస్ సెప్టెంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది. అలాగే హుష్ హుష్ అనే అనే హిందీ సీరిస్ సెప్టెంబర్ 22 నా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక జీ ఫైవ్ లో అతిథి భూతో భవా అనే హిందీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -