Krishna Vrinda Vihari Movie Review: కృష్ణ వ్రింద విహారి సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేది: సెప్టెంబర్ 23
నటీనటులు: నాగ శౌర్య, షిర్లే సేటియా, రాధిక, వెన్నెల కిషోర్
నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా ముల్పూరి
దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: తమ్మిరాజు

Krishna Vrinda Vihari Movie Review and Rating

హీరో నాగ శౌర్య హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ సినిమా కూడా ఆయనకి సక్సెస్ ని ఇవ్వడం లేదు. అయినా కూడా ఆయన సొంత హోం బ్యానర్ లో సినిమాలు నిర్మాణం జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాను కూడా ఆయన తల్లి నిర్మించారు. మరి ఈ సినిమాతో అయినా నాగ శౌర్యకి సక్సెస్ వస్తుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం.

కథ: నాగ శౌర్య ఇందులో సాంప్రదాయ బ్రహ్మిణ్‌ కుర్రాడిగా కృష్ణ పాత్రలో కనిపించాడు. హీరోయిన్ నార్త్‌ అమ్మాయి అయిన వ్రింద పాత్రలో కనిపించింది. అయితే కృష్ణ వ్రిందను తను వర్క్ చేసే ఆఫీస్ లో చూసి ఇష్టపడతాడు. ఆమెను ప్రేమించి తనను ఒప్పించడానికి ఎన్నో తిప్పలు పడతాడు. ఆ తర్వాత ఆమెను ఎలాగోలా చాలా ప్రయత్నాలు చేసి ప్రేమలో పడేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ? వారి కుటుంబ సభ్యులు కృష్ణ వ్రింద యొక్క వివాహం కు ఎలా స్పందిస్తారు? వారికి విభిన్నమైన అలవాట్ల కు వారిద్దరి వైవాహిక జీవితం ఎలా సాగింది? అన్నదే మిగతా కథ.

నటీనటుల పనితీరు: నాగ శౌర్య బ్రహ్మిణ్‌ కుర్రాడిగా బాగా నటించాడు. బాడీ లాంగ్వేజ్ తో ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ సినిమాలో నటించిచాడు అనే చెప్పాలి. సినిమాలో కొత్త లుక్ తో ఆకట్టుకున్నాడు. కానీ ఆయన నటనకు తగిన ఫలితం దక్కలేదు. షిర్లీ సెటియా నటన పర్వాలేదు అనిపించింది. ఇద్దరి మధ్య సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి యొక్క పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

విశ్లేషణ: కథ లో బలం లేదు. దర్శకుడు ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. స్క్రీన్‌ ప్లే తో కూడా ఆకట్టుకోలేక పోయాడు. లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నట్టు కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. సంగీతం యావరేజ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ విషయంలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.

సినిమాటోగ్రపీ యావరేజ్ గానే సాగింది. డైలాగ్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేవు. పైగా కొన్ని సన్నివేశాలు సింక్ లో లేనట్టుగా అనిపించింది. ఎడిటింగ్‌ సరిగ్గా లేదు. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి. కథకు తగ్గట్లుగా హీరో గారి తల్లి బాగానే ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు నాగ శౌర్య కెరీర్‌ కష్టమైన పరిస్థితి లో ఉంది.

ఈ సమయంలో ఆయనకు ఈ సినిమా తప్పనిసరిగా సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఈ సినిమా మీద పెట్టుకున్న ఆశలు కూడా పోయాయి. మంచి కథ ఎంపిక చేసుకోవడంలో నాగ శౌర్య మళ్లీ విఫలం అయ్యాడనే చెప్పాలి. పెద్దగా పోటీ లేకుండా వచ్చిన ఈ సినిమా కు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు నమోదు అయ్యే అకాశం కనిపించడం లేదు.

ప్లస్ పాయింట్స్: కామెడీ సన్నివేశాలు, నాగ శౌర్య నటన,

మైనస్ పాయింట్స్: కథ, కథనం, ఎడిటింగ్, కథలో బలమైన పాత్రలు లేవు.

రేటింగ్: 2/5

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -