Investment: పెట్టుబడి తక్కువ.. లాభాలెక్కువ.. ఏ వ్యాపారంలో తెలుసా?

Investment: మనిషి బతకాలంటే డబ్బులు అవసరం. నేటి కాలంలో డబ్బు లేకుంటే మనిషికి విలువే ఉండదు. డబ్బు ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటుందో వారినే సమాజం గౌరవిస్తోంది. అలాంటి డబ్బుకోసం వివిధ పనులు ఉద్యోగాలు చేస్తుంటారు. కొందరైతే కేవలం డబ్బు సంపాదించేందుకు తన వృత్తి కాకున్నా ఆ పనిలో దూరిపోతుంటారు. అయితే ఎంత పెద్ద ఉద్యోగామైన ఒక వయస్సు వచ్చేంత వరకే చేయాల్సి ఉంటుంది. అందుకు చాలా మంది తమకు తెలిసిన వ్యాపారాలపై అడుగులు వేస్తుంటారు. వ్యాపారం చిన్నదైనా పర్వాలేదని తమకొచ్చిన వ్యాపారాన్ని చేస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే వ్యాపారం పెట్టాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని అందరికి తెలుసు. కొందరైతే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందుతుంటారు.

 

వ్యాపారాలు కూడా కాలానికి అనుగుణంగా ప్రారంభిస్తే మంచి లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. వేసవి వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరూ చల్లదనం కోసం పాకులాడుతుంటారు. కూల్‌డ్రింక్, జ్యూస్, ఐస్‌క్రీం లాంటిని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఐస్‌క్రీం పార్లర్‌ వ్యాపారానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటారు.ఒక వేళ ఈ వ్యాపారంలో నష్టాలు వచ్చిన తక్కువగానే వస్తాయని పేర్కొంటున్నారు.

 

ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌ ప్రారంభించడానికి కేవలం రూ. 10 వేల నుంచి రూ. 20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎకరాల్లో స్థలం అవసరం ఉండదు. 400 చదరపు అడుగుల్లోనే బ్రహ్మండమైన ఐస్‌క్రీం పార్లర్‌ను స్టార్ట్‌ చేయొచ్చు. ఈ స్థలంలో దాదాపుగా 10–12 మంది కూర్చోడానికి వీలుగా సిట్టింగ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దేశంలో ఐస్‌క్రీం పార్లర్‌ వ్యాపారం ఈ ఏడాది చివరి నాటికి 1 బిలియన్‌ డాలర్లు దాటుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ) నివేదిక ప్రకారం వెల్లడైంది. అయితే ఈ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ వ్యాపారం ప్రారంభించడానికి ముందుగా ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి లైసెన్స్‌ తీసుకోవాలి. మీరు ఏర్పాటు చేసిన పార్లర్‌ స్థలం, మీరు తయారుచేసిన ఐస్‌క్రీం నాణ్యతగా ఉందని నిర్ధారిస్తేనే లైసెన్స్‌ను జారీ చేస్తోంది. ఆ తర్వాత మీరు ఇతర ఐస్‌క్రీం పార్లర్‌ సంస్థతో పొత్తు పెట్టుకుని మీ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -