Investment: ఆ ఏరియాలో పెట్టుబడులు పెడ్తూన్నా.. మీరు పక్కాగా కోటిశ్వరులే!

Investment: రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన పెట్టుబడులు వస్తున్న దరిమిలా హైదరాబాద్ రారాజులా నిలుస్తుంది. హైదరాబాదులోని కెరియర్ బూమ్ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ముందు అందులో ఉన్నట్లు ఇండియన్ రియల్ ఎస్టేట్ బెట్టింగ్ ఆన్ఏ క్యాపిటల్ ఫ్యూచర్ అనే సర్వే వెల్లడించింది. హైదరాబాదులో ఒక్కొక్క ఏరియా మరుసటి రోజుకి తన రూపురేఖలు మార్చేసుకుంటుంది.

ఈరోజు ఎందుకు పనికిరాదు అనుకున్నా ఏరియా పెట్టుబడిదారుల పుణ్యమా అంటూ మరుసటి రోజుకే ఖరీదైన ప్రాంతంగా మారిపోతుంది. ఐటీ సంస్థలకి భారీ నిర్మాణాలకి పెట్టింది పేరైన మాదాపూర్ ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిపోవటంతో పెట్టుబడిదారులు మరొక ప్రాంతాన్ని పెట్టుబడికి ఎంచుకుంటున్నారు.

 

ప్రస్తుతం పెట్టుబడిదారుల చూపులన్నీ ఉత్తర హైదరాబాదులో ఉన్న కొంపల్లి,కండ్లకోయ, శామీర్పేట, మేడ్చల్ మీదే ఉన్నాయి. ఎక్కడ పెట్టుబడి పెడితే కోటీశ్వరులు కావటం పక్కా అన్న నిర్ధారణకి వచ్చారు పెట్టుబడిదారులు. అందుకు కారణం తెలంగాణ ప్రభుత్వం తాజాగా కండ్లకోయలో ఐటీ పార్క్ ని నిర్మించనున్నట్లు ప్రకటించడం.

 

భవిష్యత్తులో ఈ ప్రాంతం ఐటి కి అడ్డాగా మారనున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు ఒక అంచనాకి వచ్చేసాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లలో చదరపు అడుగు ధర 4,500 నుంచి 5,000 వరకు పలుకుతుంది. అదే గేటెడ్ కమ్యూనిటీ అయితే 5,500 నుంచి 6,000 వరకు ధర పలుకుతుంది. అదే ఓపెన్ ప్లాట్లు అయితే గజం 60 వేల నుంచి 80,000 కి పలుకుతుంది.

 

ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో పెట్టుబడుల దారిలో దృష్టి అంతా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతానికి కలిసి వచ్చే మరో అంశం ఏమిటంటే నేషనల్ హైవే 44 ఉండడం. సుచిత్ర నుంచి దూలపల్లి చౌరస్తా వరకు మధ్యలో మూడు ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

 

అలాగే శామీర్ పేట మీద కూడా పెట్టుబడిదారుల దృష్టి పడటానికి కారణం అక్కడ జీనోమ వ్యాలీతో పాటు నల్సర్ యూనివర్సిటీ ఇంకా అనేక ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. అందుకే జీడిమెట్ల దూలపల్లి ఆల్వాల్ బొల్లారం కొంపల్లి కండ్లకోయ శామీర్పేట వంటి ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే మీరు కోటీశ్వరులు కావడం పక్కా అంటున్నారు ఆర్థిక నిపుణులు.

 

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -