50 ఆ మొక్కలను పెంచితే లక్షల్లో లాభాలు!

ఒకప్పుడు ఒక్క ఉద్యోగం సాధిస్తే జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అనుకునేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఉద్యోగాల కన్నా వ్యాపారాలకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు.వివిధ రంగాల్లోని వ్యాపారాల్లో వస్తున్న లాభాలను చూసి కొందరు ఉద్యోగాలను సైతం వదిలి వ్యాపారాల వైపు పరుగులు తీస్తున్నారు. వ్యాపారంలో కొన్ని ట్రిక్స్‌ వాటితో వాటిలో వచ్చే లాభాలకు కొదవ ఉండదని వ్యాపార నిపుణులు సూచిస్తుంటారు. కొందరు తక్కువ పెట్టుబడి పెట్టి భారీ లాభాలు సైతం పొందుతుంటారు. అయితే బిర్యానీ ఆకులను పండించే అధిక లాభాలు పొందవచ్చంటున్నారు వ్యాపార నిపుణులు.

బిర్యానీ ఆకును వంటల్లో ఉపయోగిస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే దీనిని ఎలా సాగు చేస్తారు.. ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది.. ఎంత లాభం వస్తుందనే విషయాలు తెలుసుకుంటే ఈ సాగును సులభంగా చేసుకోవచ్చు. ఈ బిర్యానీ ఆకు పంట ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు. కేవలం 50 మొక్కలు నాటడం ద్వారా దాని ఆకుల నుండి ప్రతి ఏడాది రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందజేస్తుంది. ఈ పంట సాగు కోసం మొదట్లో కష్టపడాల్సి ఉంటుంది. మొక్క పెరిగేకొద్దీ మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు సాగులో ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ అందిస్తుంది. దీనికి మార్కెట్లో చాలా డిమాండ్‌ ఉంది. అయితే బిర్యానీ ఆకును పండించడం చాలా సులభం. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.

బిర్యానీ ఆకుల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా 30 శాతం సబ్సిడీని రైతులకు అందజేస్తారు. ఒక అంచనా ప్రకారం.. ఒక మొక్క ప్రతి సంవత్సరం సుమారు 3 వేల నుంచి 5 వేల రూపాయల వరకు సంపాదిస్తుందని ఔషధ మొక్కల బోర్డు ద్వారా సమాచారం. 50 మొక్కల నుంచి ఏడాదికి 1.50 లక్షల నుండి 2.5 లక్షల రూపాయల వరకు సంపాదించ వచ్చని వ్యాపార నిపుణుల సలహాలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -