Naga Dosha: ఏం చేస్తే నాగ దోషం తొలగిపోతుందో తెలుసా?

Naga Dosha: వివిధ కారణాలతో ఒక్కొక్కరికి ఒక్కో దోషం ఉంటుంది. వాటిని తొలగించడానికి యజ్ఞాలు, హోమాలు, పూజలు చేస్తుంటారు. అయితే సర్ప దోషం ఉన్నవాళ్లు దాన్ని తొలగించుకునేందుకు నానా ఇక్కట్లు పడుతుంటారు. సర్పాలను హింసించడం, చంపడం వల్ల నాగదోషం కలుగుతుంది. నాగదోషం వలన దరిద్రం, గర్భస్రావములు, అంగవైకల్య సంతానం, చర్మ రోగాలు, తీవ్రమైన కోపం, తీవ్ర మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధిత వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు వెంటాడుతాయని శాస్త్రలు చెబుతుంటాయి. ఈ దోష తీవ్రతను తగ్గించుకునేందుకు కొన్ని పరిహారాలు అవలంభించాల్సి ఉంటుంది.

నాగదోషం ఉన్నవారు నాగుల చవితి రోజున నాగారాధన చేస్తే అనేక రకాలైన దోషాలు ముఖ్యంగా రాహు, కేతు సంబంధమైన దోషాలు తొలిగిపోతాయి. నాగుల చవితి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత ఇంట్లో నాగప్రతిమను పెట్టి దానికి అభిషేకాదులు నిర్వహించి, షోడశోపచార పూజను చేసి, నైవేద్యంగా నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, చలిమిడి దీన్ని బియ్యం పిండి, పాలు కలిపి చేస్తారు. ఇక పండ్లు, ఆవుపాలు, కొంతమంది కోడిగుడ్లను కూడా సమర్పిస్తారు.

చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగిపోతాయి. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడు తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. కాంతి పూజల కోసం శ్రీశైలము, శ్రీకాళహస్తి వెళ్లవచ్చు విశేష పూజలకు మాత్రం కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లాలి. అక్కడ పిండితో సర్ప కృతిని తయారు చేసి దానికి నాగదోష బాధితులతో పిండప్రదానం, శాంతి పూజలు చేస్తే నాగదోషం తొలగిపోతుందని అపార నమ్మకం.

Related Articles

ట్రేండింగ్

Nara Lokesh: హామీలపై మీ ధైర్యం ఏంటని ప్రశ్న.. లోకేశ్ జవాబు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Nara Lokesh: ఒకప్పుడు లోకేష్ మాట్లాడితే మాట తడబడేది, అందరూ ఆయనని పప్పు అంటూ ఎగతాళి చేసేవారు. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన చెప్పే సమాధానాలకు ముక్కున వేలేసుకుంటున్నారు....
- Advertisement -
- Advertisement -