Bald Head: బట్టతల రాకుండా ఉండాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?

Bald Head: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బట్టతల సమస్య కూడా ఒకటి. ఈ బట్ట తల కారణంగా చాలామంది పురుషులు ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు చిన్న వయసులోనే బట్టతలతో వయసు అయిపోయిన వాళ్లలా కనిపిస్తున్నారు. కొంతమంది ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ జుట్టు సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ఎక్కువ శాతం మగవాళ్ళు 37 ఏళ్ళు నిండా ముందే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పూర్వం రోజుల్లో 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే బట్టతల వచ్చేది.

కానీ రాను రాను చిన్న వయసు వారికీ ఈ బట్టతల సమస్య వేధిస్తోంది. చాలామంది ఈ బట్టతల రాకుండా ఉండడం కోసం హెయిర్ ప్లాంటేషన్ అని, అనేక రకాల సోప్స్,క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఉపయోగం లేకపోయేసరికి చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి బట్టతల సమస్యలు పోగొట్టుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బట్టతల రాకుండా జుట్టు పెరగడానికి ఉపయోగపడే పండ్ల లో పైనాపిల్ కూడా ఒకటి.

 

పైనాపిల్ లోని విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియంతో పాటు ఇతర ఫ్లెవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అలాగే బొప్పాయి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో వెంట్రుకలను పోషించే సామర్థ్యం ఉంది. బొప్పాయి లోని విటమిన్ సి ఉంటుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. కివీ పండు కూడా బట్టదల సమస్యకు బాగా పనిచేస్తుంది. కివి పండు కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆరోగ్యకరమైన కుట్టు పెరగడానికి కుట్టు మూలాలకు రక్తప్రసరణ అందేలా చేస్తుంది. ఇందులోని విటమిన్ ఏ, సి, ఈ, కే, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు కావల్సిన తేమను అందించి జుట్టు బాగా పెరిగేలా చేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -