Viral: గూగుల్ మ్యాప్ నమ్మి మోసపోయిన ఆటో డ్రైవర్

Viral: ఈ మధ్య ప్రతి విషయానికి గూగుల్ సెర్చ్ చేయడం అనేది కామన్ గా మారింది. ఏ పనికైనా సరే, ఏది తెలుసుకోవాలన్నా సరే గూగుల్ లో టైప్ చేస్తున్నారు. గూగుల్ లో ప్రతీది లభిస్తుంది. క్షణాల్లో సమాచారం మొత్తం వచ్చేస్తుంది. దీంతో ప్రతి విషయానికి గూగుల్ సెర్చ్ చేసేవాళ్లు ఎక్కువయ్యారు. ఇక గూగుల్ మ్యాప్స్ అందరికీ తెలిసిందే. ఎక్కడైనా మనకు తెలియని ప్లేస్ కు వెళ్లాలన్నా.. కొత్త ప్లేస్ కు వెళ్లాలన్నా వెంటనే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తారు. ఎక్కడికి వెళ్లాలో గూగుల్ మ్యాప్ లో టైప్ చేసి దానిని ఫాలో అవుతారు. గూగుల్ మ్యాప్స్ లో చూపించినట్లు ఫాలో అవుతారు. అయితే గూగుల్ మ్యాప్స్ లో అన్నీ కరెక్ట్ గా చూపిస్తాయని నమ్మడం పొరపాటే. ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్స్ లో తప్పు కూడా చూపించవచ్చు.

కొంతమంది గూగుల్ మ్యాప్ ను ఫాలో అయ్యి బొక్కబోర్లా పడ్డా సంఘటనలు చాలా చూశాం. గూగుల్ మ్యాప్ లో తప్పుగా చూపించడంతో వేరే ప్రాంతానికి వెళ్లిన వార్తలు చాలా చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. తాజాగా ఒక ఆటోడ్రైవర్ గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యి బ్రిడ్జిపైకి వెళ్లాడు. గూగుల్ మ్యాప్స్ ను నమ్మి యూటర్న్ తీసుకోవాల్సింది పోయి ఆటోను ఫుడ్ ఓవర్ బ్రిడ్జి ఎక్కించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. చాలా ఫన్నీగా ఉందని, గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యి బొక్కబోర్లా పడ్డాడని ఫన్నీగా కామెంట్స్ చేస్తన్నారు. ఈ వీడియో నెట్టింగ్ తెగ వైరల్ గా మారుతుతోంది. గూగుల్ మ్యాప్ ను నమ్మి మోసపోయాడు పాపం అంటూ కొంతమంది, ఆటో డ్రైవర్ ను గూగుల్ మ్యాప్స్ మోసం చేసిందని మరిరొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -