Bangalore: 38 ఏళ్ల క్రితం చదువు వదిలేసిన ఆటో డ్రైవర్.. ఈయన ఇంగ్లీష్ లో సాధించిన మార్కులు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Bangalore: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఇలాంటి వాళ్లని చూస్తేనే అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని బాధ్యతల్లో ఉన్నప్పటికీ, వయసు ఎంత పైబడినప్పటికీ తనకి చదువు మీద ఉన్న ఆశని వదులుకోలేదు ఒక ఆటో డ్రైవర్. స్కూల్ వదిలేసిన 38 సంవత్సరాల తర్వాత పీయుసీ ఎగ్జామ్ రాసి రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగళూరుకి చెందిన నిధి అగర్వాల్ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

దాదాపు 38 సంవత్సరాల తర్వాత పాఠశాల నుంచి తప్పుకున్న ఆటో డ్రైవర్ భాస్కర్ తన ప్రీ యూనివర్సిటీ కోర్సు పరీక్షల్లో భాగంగా ఇటీవల తన ఇంగ్లీష్ పేపర్ ని ఎలా తీసుకున్నాడో ఈ ట్వీట్లో వివరించింది. ఈరోజు నా @ ఓలా క్యాబ్స్ ఆటో సహచరుడైన భాస్కర్ జిని పరిచయం చేస్తున్నాను. అతను ఈరోజు ఇంగ్లీష్ పేపర్ ని ఎదుర్కొన్నాడు. 1985లో పదవ తరగతి క్లీన్ చేసి ఇప్పుడు పీయుసీ పరీక్షలు రాస్తున్నాడు.

 

ఇతను ఇద్దరు పిల్లల తండ్రి. వాళ్లు మూడవ తరగతి, ఆరవ తరగతి చదువుతున్నారు. అతని చిరునవ్వు నిజంగా ప్రేరణ ఇచ్చింది అని నిధి ఆ ఆటో డ్రైవర్ చిత్రాన్ని సైతం షేర్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త వైరల్ అయింది. ఆ క్లిప్పింగ్ లో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా బస్సులు నడుపుతున్నందుకు ఆటో రిక్షా డ్రైవర్ పై ఆ ప్రభావం పడిందని వీడియోలో పేర్కొన్నాడు భాస్కర్.

 

తనకి ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవటంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేసిన ఐదు గంటల్లో కేవలం 40 రూపాయలు మాత్రమే సంపాదించానని డ్రైవర్ చెప్పడం వీడియోలో వినబడుతుంది. తన సంసార బాధ్యతని మోస్తూ ఇంత తక్కువ సంపాదనలో కూడా తను అనుకున్నది సాధించిన ఈ వ్యక్తిని చూస్తే నిజంగా అభినందనలు తెలపవలసిందే.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -