Nightmares: రాత్రిపూట ఇవి తింటే పీడ కలలు తప్పవు.. నిద్ర అసలే రాదు!

Nightmares: మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. గజిబిజి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆఫీసుల్లో వర్క్‌ టెన్షన్‌.. ఇలా కారణాలు ఏవైనప్పటికీ రాత్రిపూట పడుకొనే సమయానికి కరెక్ట్‌గా నిద్రాదేవత రానంటుంది. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టా గ్రామ్‌, యూట్యూబ్‌ లాంటివి చూసుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. నిద్ర తక్కువైతే మన బాడీలో చాలా రకాల సమస్యలు వచ్చి అనారోగ్యానికి దారి తీస్తుంది.

 

ముఖ్యంగా రాత్రిపూట తీసుకొనే ఆహారాన్ని బట్టి కూడా నిద్ర రాకపోవడం, పీడ కలలు రావడం లాంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తీసుకోకూడని కొన్ని ఆహారాలను సూచిస్తున్నారు. వీటిని అవాయిడ్‌ చేయడం వల్ల రాత్రిపూట నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు. మరి అవేంటో మీరూ తెలుసుకొని పాటించి చక్కటి నిద్రను ఎంజాయ్‌ చేయండి..

 

రాత్రిపూట జున్ను తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. పడుకొనే ముందు జున్ను తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుందట. పీడకలలు కూడా వేధిస్తాయని చెబుతున్నారు. తర్వాత ముఖ్యంగా చాక్లెట్స్‌ అస్సలు తీసుకోరాదు. రాత్రి పడుకొనే ముందు చాక్లెట్స్‌ తినడం వల్ల గాఢ నిద్రను నిరోధిస్తుందని చెబుతున్నారు. చాక్లెట్‌ వల్ల అశాంతి నెలకొంటుందట. తద్వారా పీడకలలు వస్తాయంటున్నారు.

 

పెరుగును అవాయిడ్‌ చేయాలి..
ఇక చిప్స్‌ లాంటి ఫుడ్‌ కూడా అవాయిడ్‌ చేయాలని సూచిస్తున్నారు. చిప్స్‌లో ఉండే జిడ్డు.. ఆహారాల్లోని కొవ్వులు జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటాయని చెబుతున్నారు. అందువల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నారు. వీటితోపాటు రాత్రిపూట పెరుగును కూడా తీసుకోరాదట. పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇది శ్వాసకోస వ్యవస్థపై ప్రభావం చూపి మెదడుకు రక్త ప్రసరణను ఆలస్యం చేస్తుందట. అలాగే వేడివేడిగా ఉండే సాస్‌ను కూడా తినరాదని స్పష్టం చేస్తున్నారు. సాస్‌ తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్ర రాకుండా చేస్తుందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -