Mangoes: మామిడితో కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఇవే?

Mangoes: వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిలో మామిడి పండ్లు కూడా ఒకటి. మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్లలో కూడా అనేక రకాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కావడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడి పండ్లు తప్పనిసరిగా ఉంటాయి. కాగా ఈ మామిడి పండ్లను తినడం వల్ల వాటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, పొటాషియం, జింక్ కార్బోహైడ్రేట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

అయితే మనలో చాలామంది మామిడిపండును అలాగే తింటే ఇంకొందరు మాత్రం కొన్ని రకాల పదార్థాలతో కలిపి తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల పదార్థాలతో మామిడిపండుని కలిపి అస్సలు తినకూడదు అంటున్నారు వైద్యులు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది మామిడిపండు తో పాటు పెరుగును కలిపి తింటూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే చాలామంది మ్యాంగో లస్సి అని తాగుతూ ఉంటారు. ఇది ఒకవేళ మ్యాంగో లస్సి అని మ్యాంగో పెరుగు కలిపి తింటూ ఉంటే వెంటనే మానేయడం మంచిది. ఎందుకంటే మామిడితో పాటు పెరుగు తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

 

మామిడి అలాగే సీతాఫలం.. ఈ రెండింటినీ కలిపి తినకూడదు. అయితే మామిడి పండు తిన్న తర్వాత సీతాఫలం తినకూడదు. లేకపోతే, ఇది వికారం, వాంతులు, శ్వాస సమస్యలు మొదలైన వాటికి కారణమవుతుంది. మామిడిపండు సీతాఫలం రెండు ఒకే సీజన్లో దొరకడం చాలా అరుదు అని చెప్పవచ్చు. అలాగే మామిడి పండ్లు మసాలా ఆహారాలు.. ఈ రెండు కాంబినేషన్ల ఫుడ్ ని చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ అలా తినడం వల్ల మొటిమలు చర్మ వ్యాధులు వస్తాయి. మామిడి, నీరు.. చాలా మందికి భోజనాల మధ్య నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిది కాదు. అలాగే మామిడికాయలు తిన్నప్పుడు, తిన్న తర్వాత కూడా నీళ్లు తాగడం మానుకోండి. లేదంటే ఆరోగ్యానికి హానికరం.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -