Junior Artists: ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తాడా?

Junior Artists: టాలీవుడ్ లో హీరోయిన్లతో పాటు మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులపై ప్రొడ్యూసర్ల పెత్తనం ఎక్కువవుతోంది. టాలీవుడ్ లో ఓ పెద్ద నిర్మాణ సంస్థకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండే ఓ వ్యక్తి ఇప్పటి వరకూ చాలా సినిమాలకు పనిచేశాడు. స్టార్ హీరోల సినిమాలకు సైతం అతడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. అయితే ఇప్పుడు అతను ముసలోడు అయిపోయాడు. కానీ అతనిలోని కాముడు ఇంకా ముసలోడిగా మారడం లేదు. మెగా సినిమాలకే అతడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. వయసు పెరిగినా అతనిలో మాత్రం కోరికలు తగ్గడం లేదు.

 

చాలా మంది మహిళా జూనియర్ ఆర్టిస్టుల జీవితాలతో ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెలగాడం ఆడాడని, వారి జీవితాలను నాశనం చేశాడనే విమర్శలు ఆయనపై ఎక్కువగా ఉన్నాయి. మహిళా జూనియర్ ఆర్టిస్టులను ఆయన లొంగదీసుకోవడం, వారిపట్ల పైశాచికంగా ప్రవర్తించడం, వాళ్లతో రాత్రంతా గడిపి వారిని విపరీతంగా టార్చర్ చేయడం జరుగుతోందని ఇండస్ట్రీలో కొందరు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా 20 ఏళ్ల వయస్సున్న యువతులు, మహిళా ఆర్టిస్టులపై అతని కన్ను పడితే వదలడనే టాక్ ఉంది.

 

ఎంతో మంది మహిళా జూనియర్ ఆర్టిస్టుల జీవితాలను అతను చిదిమేస్తున్నాడని, అతని మాయలో పడి చాలా మంది బలైపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు, పెళ్లై ఆర్థిక ఇబ్బందులతో ఉండే మరొకొందరు అతని చేతిలో పడి నలిగిపోయారని సమాచారం. జూనియర్ ఆర్టిస్టులు రోజుకు రూ.750 నుంచి రూ.1500ల వరకూ పనిచేస్తూ ఉంటారు. అందులో అందంగా ఉండి ఆర్థిక ఇబ్బందితో ఉండే వారిని ఈ ముసలి నిర్మాత లొంగదీసుకుంటూ ఉంటారని తెలుస్తోంది.

 

కొందరు మధ్య వయస్సున్న ఆంటీలను మధ్యవర్తులగా మార్చి అమ్మాయిలతో మాట్లాడమని పురమాయించినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆడ బ్రోకర్లు కూడా ఆ ముసలి నిర్మాత ఇచ్చే డబ్బులకు ఆశపడి కక్కుర్తి పడి యువతులను బలవంతంగా ఒప్పిస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. చాలా మంది ఆర్టిస్టులను రాత్రిపూట గెస్ట్ హౌస్ లకు రమ్మని పిలిపించుకుని వారి జీవితాలను ఆ ముసలి నిర్మాత చిదిమేస్తున్నారట. ఈ విషయం బయటకు రావడంతో ఆ ముసలి నిర్మాతకు ఓ స్టార్ హీరో వార్నింగ్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -