Phone: కూతురు ఫోన్ మాట్లాడుతోందని మర్డర్ చేసిన తండ్రి

Phone: ఇప్పుడు ఫోన్ యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎవ్వరి చేతుల్లో అయినా ఫోన్ కనిపిస్తుంది. ప్రతి మనిషిలో ఇప్పుడు ఫోన్ ఒక భాగం అయిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మరి అలాంటి ఫోన్ వల్ల నేరాలు కూడా పెరుగుతున్నాయి. మనుషుల్లో క్రమంగా ఓర్పు, సహనం నశిస్తోంది. ఇదంతా ఫోన్ వల్లనేనని మరికొందరు అంటున్నారు. అయితే ఫోన్ వల్ల నష్టాలతో పాటు లాభాలు కూడా ఉన్నాయని మరికొందరు సమర్ధిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఫోన్ వల్ల ఓ తండ్రి చేయకూడదని పని చేశాడు.

 

మీరు ఎవర్నైనా కలవడానికి వెళ్లినప్పుడు వారితో మీరు మాట్లాడుతూ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడొక వ్యక్తి ఫోన్ చూస్తోందని, మాట్లాడుతోందని తన కూతుర్ని చంపేశాడు. ఈ దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని ముషీరాబాద్‌లో ఈ దారుణం జరిగింది. కూతురు ఉన్నీసా అదే పనిగా ఫోన్ మాట్లాడుతోందని, పగటి పూటే కాకుండా రాత్రి పూట కూడా ఆమె ఎక్కువగా ఫోన్ మాట్లాడుతోందని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విషయంలో చాలా సార్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చి మందలించాడు. అయితే తండ్రి ఎంత చెప్పినా కూడా కూతురులో మార్పు రాలేదు.

 

ఉన్నీసా తీరు మార్చుకోలేదని ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. అర్థరాత్రి ఈ ఫోన్ గోల ఏంటి అని ఆగ్రహించిన తండ్రి ఉన్నీసా గొంతు నొక్కి హత్య చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి దీనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది. కూతురికి నచ్చజెప్పాల్సిన తండ్రే ఇలా సహనం కోల్పోయి ప్రాణాలు తీయడం అందర్నీ ఆగ్రహానికి గురి చేస్తోంది. ప్రస్తుతం చాలా మందికి సహనం అనేది ఉండకుండా ఉందని, ఇది చాలా తప్పని, ఇటువంటి దారుణాలకు దారితీసే అవకాశం ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -