Wife And Husband: కన్నీరు తెప్పిస్తున్న ఘటన.. భార్య చనిపోయిన గంటకే భర్త ఆత్మహత్య?

Wife And Husband: తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని కొంకాపల్లి ప్రాంతం లో విజయ్ కుమార్ అనే 47 ఏళ్ళ వ్యక్తి తులసీలక్ష్మీ 45 దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే భర్త ఓఎన్జీసీ సబ్ కాంట్రాక్టర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఇక కుమారుడుని చదివించుకుంటూ దంపతులు సంతోషంగా ఉంటున్నారు.

 

కాగా ఇటీవల తులసి లక్ష్మికి గత మూడు నెలల కిందట మెదడుకి శస్త్రచికిత్స జరగడంతోఈమె ఇంట్లోనే ఉంటోంది. దీంతో అప్పటి నుంచి వీరి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు గురైంది. ఆర్థికపరమైన కష్టాలు ఎదురవ్వడంతో భర్త విజయ్ అప్పులు చేశాడు. కుటుంబం పరిస్థితి ఊహించని రీతిలో మారిపోవడంతో విజయ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అయితే ఎప్పటిలాగే ఈ దంపతులు రాత్రి తిని పడుకున్నారు. ఇక తెల్లవారుజామున భర్త విజయ్ కుమార్ నిద్రలేచాడు. ఉదయం 7 గంటలు అయినా భార్య నిద్ర లేవలేదు. ఏం జరిగిందని భర్త విజయ్ కుమార్ భార్య తులసీని నిద్రలేపే ప్రయత్నం చేయగా ఆమె ఎంతకు లేవలేదు దాంతో కొద్దిసేపటి తర్వాత భార్య చనిపోయిందని తెలుసుకున్న విజయ్ తట్టుకోలేకపోయాడు.

భార్య లేదు, ఇక రాదు అన్న చేదు విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు విలసేలా రోదించాడు. ఈ క్రమంలోనే భర్త విజయ్ కుమార్ భార్య లేని జీవితం నాకు వద్దనుకుని ఇంటి రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలే తల్లి పోయి ఇక్కడ దుఃఖంలో ఉన్న కుమారుడికి ఈ విషయం తెలియడంతో గుండెల్లో విలసేలా రోధించడంతో అది చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. అయితే భార్య చనిపోయిన గంటకే భర్త ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -