Kaneria: బాబర్ ఓ పెద్ద గుండుసున్నా.. పాక్ కెప్టెన్‌పై కనేరియా విమర్శలు

Kaneria: ఉపఖండ జట్లను వారి సొంత గడ్డపై ఓడించడం అంత సులువు కాదు. బంతి గింగిరాలు తిరిగే పిచ్ లపై స్పిన్నర్లను ఎదుర్కొంటూ ఆతిథ్య జట్లను ఎదురొడ్డి నిలవాలంటే ఎంతో కష్టం. అలాంటిది పాకిస్థాన్ టీమ్ ను చిత్తుచిత్తుగా ఓడించి.. మూడు టెస్టుల సిరీస్ ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లండ్. బజ్ బాల్ క్రికెట్ ఆడుతూ ప్రత్యర్థిని భయపెట్టింది. దీంతో పాక్ సారధి బాబర్ ఆజమ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 

పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అయితే ఓ రేంజ్ లో బాబర్ ఆజమ్ మీద విమర్శలు చేశారు. ఆజం అతిపెద్ద గుండు సున్నా అంటూ ఆయన అభివర్ణించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో బాబర్ ఆజమ్ ను పోల్చడం సరికాదని ఆయన పేర్కొన్నాడు. రోహిత్, విరాట్ లాంటి ఆటగాళ్లతో సరిపోయే ప్లేయర్లు పాక్ జట్టులో లేనేలేరని ఆయన కుండబద్దలు కొట్టాడు. మాటలు మాత్రం కోటలు దాటిపోయేలా ఉంటాయని.. ఫలితాలు మాత్రం శూన్యమంటూ దుయ్యబట్టారు.

 

‘పాకిస్థాన్ జట్టును నడిపించే సత్తా బాబర్ ఆజమ్ కు లేదు. టెస్టుల్లో టీమ్ ను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం అతడికి లేదు. అతడు తన ఈగోను పక్కన పెట్టి కెప్టెన్సీని సర్ఫరాజ్ అహ్మద్ కు ఇచ్చేయడం బెటర్. సుదీర్ఘ ఫార్మాట్ లో అతడు ఆడకపోవడమే మంచిది’ అని కనేరియా సూచించాడు.

 

కనేరియాతో పాటు చాలా మంది మాజీ ఆటగాళ్లు ఆజమ్ పై విమర్శలకు దిగుతున్నారు. చెత్త కెప్టెన్సీ చేశాడని, ఆయన ఆట ఘోరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ ఆటతీరుపై కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. టెస్టు క్రికెట్ ను కూడా టీ20ల్లా ఆడేస్తూ మతిపోగుతున్నారని వారిని అందరూ మెచ్చుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -