Nara Lokesh: గులకరాయి ఘటనలో జగన్ కు భాస్కర్ అవార్డ్.. నారా లోకేశ్ పంచ్ లు వేరే లెవెల్!

Nara Lokesh:  ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజులలో జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీలో ఎన్నికల హీట్ మరింత పెరుగుతుంది. ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నీరు కొండలో నిర్వహించినటువంటి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైనా అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగినటువంటి రాయి దాడి ఘటన గురించి ఈయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి గులకరాయి ఘటనలో ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. అనంతరం అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కౌలుకు డబ్బులు ఇవ్వడం లేదు అంటూ చాలామంది రైతులు ఫిర్యాదు చేశారు. రాజధానిలో పేదలకు ఇచ్చే పెన్షన్ కూడా సక్రమంగా రావడం లేదంటూ అక్కడ ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పేదలకు ఇచ్చే 5000 రూపాయల పెన్షన్ అలాగే కొనసాగిస్తామని తెలిపారు. అంతేకాకుండా కౌలు రైతులకు ఇచ్చే డబ్బును వడ్డీతో సహా ఇస్తామని తెలిపారు.

ఇక జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే గులకరాయి ఈ ఘటన గురించి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. గత ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈయన ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తూ గెలుపు సాధించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈయనకు పూర్తిగా వైసిపి నుంచి మురుగుడు లావణ్య పోటీకి దిగిన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -