KCR-Jagan: జగన్ కోసం కేసీఆర్ తాపత్రయం వెనుక అసలు లెక్కలివే.. ఓడితే మునిగినట్టేనా?

KCR-Jagan: ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల విషయంలో తెలంగాణలో సైతం పెద్ద ఎత్తున హడావిడి ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల గురించి ఇటీవల బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఏపీలో మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే అంటూ ఈయన కామెంట్లు చేశారు. ఈ విధంగా జగన్ ప్రభుత్వానికి మద్దతుగా కెసిఆర్ కామెంట్లు చేయడం వెనుక చాలా కారణం ఉందని తెలుస్తోంది.

కెసిఆర్ గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు మద్దతు తెలియజేశారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది ఇటీవల కెసిఆర్ అనారోగ్యానికి కూడా అయితే జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించారు కూడా. అయితే ఇప్పటికే జగన్ కేసీఆర్ మధ్య మంచి అనుబంధం కొనసాగుతూనే ఉందని చెప్పాలి. అలాగే కేటీఆర్ సైతం ఇటీవల జగన్ పై జరిగిన రాయి దాడిలో స్పందించి జాగ్రత్త అన్న అంటూ కామెంట్లు చేశారు.

ఇలా వీరి మధ్య అనుబంధం కొనసాగుతూ ఉన్నప్పటికీ కెసిఆర్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారు అంటూ వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు జగన్ కి చాలా సుపరిచితులు జగన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి అధికారంలోకి రావాలని ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

ఒకవేళ జగన్ ముఖ్యమంత్రికాకపోయి చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రేవంత్ రెడ్డికి చాలా బలం వస్తుంది అంతే కాకుండా ఈయనతో పాటు బిజెపి కూటమి కూడా ఏకం కావడంతో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే కెసిఆర్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేయడమే కాకుండా జగన్ గెలవాలని కూడా కోరుకుంటున్నారు. జగన్ గెలిస్తే పర్వాలేదు కానీ ఓడితే మాత్రం ఇటు జగన్ అటు కేసీఆర్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -