YSRCP Manifesto: వైసీపీ మేనిఫెస్టోలో మాయమైన ఈ స్కీమ్ గురించి తెలుసా.. మహిళలంటే లోకువా?

YSRCP Manifesto: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఎలాంటి హామీలను చేర్చలేదని గత ఎన్నికల సమయంలో చెప్పినటువంటి నవరత్నాలను ఈసారి కూడా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇక నవరత్నాలలో భాగంగా సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి లబ్ధిదారులకు ఈసారి సంక్షేమ పథకాల ద్వారా మరింత అదనంగా డబ్బును అందుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అయితే గత ఎన్నికల ముందు ప్రకటించిన పథకాలన్నీటిని కొనసాగించినటువంటి ఈయన మహిళలకు ప్రయోజనకరంగా ఉన్నటువంటి వైయస్సార్ ఆసరా స్కీం మాత్రం కనిపించలేదు.

గత ఐదు సంవత్సరాల కాలంలో డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. దీంతో పలుచోట్ల మహిళలు అంటే జగన్మోహన్ రెడ్డికి అందులో ఒక మహిళలకు ప్రయోజనకరంగా ఉన్నటువంటి ఈ పథకాన్ని రద్దు చేశారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈయన ఏ పథకానికి ఎంత మొత్తంలో డబ్బును పెంచారు అనే విషయాలను తెలిపారు. అంతేకాకుండా పెంచిన డబ్బు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనే విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో స్పష్టంగా వివరించారు. మరి ఈసారి కూడా నవరత్నాల పై నమ్మకంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి విజయం దక్కుతుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -