CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు చూస్తే వై నాట్ 15 వై నాట్ 17 అనే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తుంది.

ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి కూటమికి విజయం అందించారు. గత ఎన్నికలలో భాగంగా ఈయన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేస్తూ నవరత్నాలు అంటూ పలు సంక్షేమ పథకాలను అందించారు. అయితే ఈసారి నవరత్నాలు కాకుండా రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అంటూ పలు కొత్త అంశాలను విడుదల చేస్తారని అందరూ భావించారు కానీ తిరిగి ఆ నవరత్నాలని తన ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించారు.

అయితే అమ్మబడి 15000 నుంచి 17 వేలుకు చేశారు అలాగే వృద్ధాప్య పింఛన్ కేవలం 500 మాత్రమే పెంచారు ఇలా ఎన్నికల మేనిఫెస్టో చూసినటువంటి వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు తీవ్రత నిరుత్సాహం వ్యక్తం చేశారు. లేకపోతే టిడిపి ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలలోకి వెళ్లిపోయాయి. ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధాప్య పెన్షన్ 4000 ఇలా పథకాలు ప్రజల్లోకి పూర్తిగా వెళ్లిపోయాయి.

అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కాస్తయినా వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నారు కానీ ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత కూటమి గెలుపు ఖాయమని స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూటమికి గెలుపును మేనిఫెస్టో రూపంలో అందించారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -