Raj Kundra: నన్ను బలిపశువు చేశారు.. నేను ఎటువంటి తప్పు చేయలేదు: రాజ్ కుంద్రా

Raj Kundra: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరు గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈయన గతంలో నీలి చిత్రీకరణ వ్యవహారంలో దొరికిపోయాడు. వాటిని చిత్రీకరిస్తూ ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తున్నట్లు తెలిసింది. ఇతనితో పాటు ఈ వ్యవహారంలో మరికొంతమంది చేతులు ఉన్నట్లు బయటపడింది.

ఇక చాలామంది అమాయకులకు వెబ్ సిరీస్ లో అవకాశం ఇస్తామని చెప్పి వారిని బలవంతంగా అటువంటి వ్యవహారంలోకి దింపినట్లు తెలిసింది. గతంలో ఈ వ్యవహారం బయటపడటంతో పాటు అతడు వీటి కోసం ఏర్పాటు చేసుకున్న హాట్ షాట్ అనే యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు.

ఆ తర్వాత మరో యాప్ బాలి ఫేం అనే పేరుతో ఏర్పాటు చేయగా ఈ విషయాన్ని ముంబై పోలీసులు ముందుగానే తెలుసుకొని మీడియా ముందు బయట పెట్టారు. ఇక రాజ్ కుంద్రా ఈ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ బ్యూరో కి చెందిన ఓ అధికారిని కూడా అతనికి తెలియ కుండానే అతడిని భాగస్వామి చేశాడు.

ఇక ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ని కూడా విచారించగా అందులో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. ఇక ఈ నీలి చిత్రీకరణ కేసుపై అతడికి జూలై 19న కేసు నమోదు కాగా వెంటనే అతడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇతడికి బెయిల్ అవకాశం రావటంతో దాని ద్వారా ప్రస్తుతం బయట తిరుగుతున్నాడు.

ఇక ఇంతకాలం మౌనంగా ఉన్న రాజ్ కుంద్రా తాజాగా తనపై మోపిన కేసులు కొట్టివేయాలని మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ ఆశ్రయించాడు. ఈ కేసులో చెప్పినట్టుగా తను ఎటువంటి నేరం చేయలేదని రహస్యంగా ఎటువంటి చిత్రీకరణ చేయలేదంటూ పైగా బ్లూ ఫిలిం కంటెంట్ యాప్ లోడ్ చేయలేదు అంటూ ఇక వాటిని ప్రసారం చేసే కార్యక్రమాలలో కూడా పాల్గొనలేదని అన్నాడు.

అంతేకాకుండా చార్జ్ షీట్ లో తను ఎవరిని బెదిరించలేదు అంటూ.. బలవంతం పెట్టి వీడియో తీసినట్టు ఎక్కడా కూడా లేదని.. తను ఎటువంటి నేరం చేయలేదు అంటూ.. ఈ కేసులో తనను బల్లి పశువు చేశారు అంటూ.. తనపై ఉన్న కేసును కొట్టివేయాలి అంటూ కోర్టును ఆశ్రయించాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -