Old Women: ఈ వృద్ధురాలి కన్నీటి కష్టాలు వింటే రాతి గుండైనా కరగాల్సిందే!

ప్రస్తుత సమాజంలో మానవత్వం అన్నది కరువవుతోంది. చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను భారంగా భావించి అనాధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఇంకొందరు అయితే దారుణంగా కొట్టడం చంపడం లాంటివి కూడా చేస్తున్నారు. కనీసం వృద్ధులు అన్న మర్యాద గౌరవం తల్లిదండ్రులు అన్న ప్రేమ కూడా లేకుండా వారిని దారుణంగా హింసిస్తున్నారు. కొందరు అయితే ఇంట్లో ఇంట్లో వృద్ధులకు కనీసం భోజనం కూడా పెట్టకుండా నరకం చూపిస్తున్నారు. కనిపించిన తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. వృద్ధాశ్రమం నడిరోడ్డులపై ముసలి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఒక 75 ఏళ్ల వృద్ధురాలికి సంబంధించిన ఒక వీడియో ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఆ వీడియో విషయానికి వస్తే.. ఒక 75 ఏళ్ల వృద్ధురాలు ఒక ఇల్లు లేక ఉండడానికి స్థలం లేక ఒక చెట్టు కిందనే నివసిస్తోంది. ఆ చెట్టు కింద నేను నివసిస్తూ మంచాన్ని, సరుకులను చెట్టుకు వేలాడదీసి అక్కడే 15 ఏళ్లుగా నివాసం ఉంటుంది. అయితే ఆ ఊరి ప్రజలు అటుగా వెళ్తున్న వారు సహాయం చేస్తే వాటిని తీసుకొని వాటి ద్వారా కాలాన్ని వెల్లబుచ్చుతోంది. కనీసం ఆ వృద్ధురాలికి గవర్నమెంట్ తరఫున పెన్షన్ కూడా రాకపోవడం బాధాకరమైన విషయం.

ఆమెకు భర్త ఒక కొడుకు కూతురు ఉండగా కొడుకు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోగా కూతురు క్యాన్సర్ కారణంగా మృతి చెందింది. భర్త కూడా అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆమె ఒంటరి మహిళగా చెట్టు కింద 15 ఏళ్లుగా నివాసం ఉంటుంది. ఎండ వచ్చినా, గాలి వచ్చినా వానలు వచ్చినా కూడా ఆ వృద్ధురాలు అక్కడే నివసిస్తోంది. ఆమెను ఒక ఛానల్ వారు ఇంటర్వ్యూ చేయగా ఇంటర్వ్యూలో ఆమెను తన బాధను వ్యక్తం చేయడంతో ప్రతి ఒక్కరు ఆ వీడియోని చూసి కంటతడి పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -