Viral: వైరల్ అవుతున్న ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్!

Viral: మలయాళ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆర్య పార్వతి ఈ మధ్యకాలంలో తన తల్లి ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. 23 సంవత్సరాల వయసు కలిగినటువంటి నటి ఆర్య పార్వతి తల్లి 47 సంవత్సరాల వయసులో మరో బిడ్డకు జన్మనివ్వడంతో ఒక్కసారిగా ఈమె వార్తల్లో నిలిచారు.

ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమెకు బుల్లి చెల్లి పుట్టిందని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన బుల్లి చెల్లిని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్వతి తన తల్లి ప్రెగ్నెన్సీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.మా అమ్మ ప్రెగ్నెన్సీ విషయం మా నాన్న ద్వారా నాకు తెలిసిందే. అప్పటికే అమ్మ ఎనిమిది నెలల గర్భవతి అని తెలిపారు.

 

ఇలా నాన్న అమ్మ ప్రెగ్నెన్సీ గురించి చెప్పడంతో తనకు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదని తెలిపారు. 23 సంవత్సరాల వయసులో ఉన్న తాను తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వార్త వినాల్సి రావడం కాస్త కష్టంగానే అనిపించిందని తెలిపారు.అయితే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు తనకు చెబితే నేను ఎలా రియాక్ట్ అవుతానోనని భయపడ్డారు అందుకే కొంతకాలం పాటు ఈ విషయాన్ని దాచి పెట్టారని ఈమె తెలియజేశారు.

 

ఇక నాన్న అమ్మ ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పగానే తాను వెంటనే వెళ్లి అమ్మ ఒడిలో ఏడుస్తూ కూర్చున్నానని, నిజానికి నేను ఎంతో కాలం నుంచి ఈ శుభవార్త కోసమే ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇక ఈ విషయం విన్న తర్వాత నేను ఎందుకు సిగ్గుపడతానని అమ్మతో చెప్పాను అంటూ ఇంటర్వ్యూ సందర్భంగా నటి ఆర్య పార్వతి తన తల్లి ప్రెగ్నెన్సీ గురించి తన బుల్లి చెల్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -