Durga Devi: దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేయకూడదా.. ఏం జరిగిందంటే?

Durga Devi: సాధారణంగా మనం దేవదేవతలకు పూజ చేయాలి అంటే వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేస్తుంటాము. ఇలా భక్తిశ్రద్ధలతో పూజ చేసి స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలని భావిస్తారు. అయితే కొన్ని దేవతలకు అలాగే దేవుళ్లకు కొన్ని రకాల పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెంది మనపై వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని భావిస్తారు.

 

అదేవిధంగా కొన్ని పుష్పాలతో కొంతమంది దేవలను పూజించడం వల్ల వారి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే దుర్గామాతను పూజించే సమయంలో ఎలాంటి పువ్వులతో అమ్మవారిని పూజించాలి. ఎలాంటి పుష్పాలను అమ్మవారికి పెట్టకూడదు అనే విషయానికి వస్తే…

దుర్గాదేవిని పూజించే సమయంలో ఎట్టి పరిస్థితులలో కూడా జిల్లేడు పుష్పాలను, నందివర్ధనం ,పారిజాతం, నాగచంప, తంగేడు, బృహస్పతి వంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ఇలాంటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మనపై ఉండడం ఏమో కానీ అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు.

 

ఇక దుర్గామాతకు ఎలాంటి పుష్పాలతో పూజ చేయాలి అనే విషయానికి వస్తే దుర్గామాతకు కేవలం సంపంగి పుష్పాలతో పూజ చేయడం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెంది తన కరుణ కటాక్షాలు మనపై ఉండేలా చూస్తుందట. ఇక అమ్మవారిని పూజించే సమయంలో గంటను కూడా ఉపయోగించకూడదని పండితులు చెబుతుంటారు.ఇలా ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల మనం ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -