Haircut: మంగళవారం రోజున హెయిర్ కట్ చేయించుకుంటే ఇన్ని నష్టాలు ఉన్నాయా?

Haircut: సాధారణంగా మన ఇంట్లోని పెద్దలు వారంలో కొన్ని రోజులలో కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా మంగళవారం రోజున కొన్ని రకాల పనులను అస్సలు చేయకూడదు అని చెబుతూ ఉంటారు. మంగళవారం దుర్గాదేవికి ఆంజనేయ స్వామికి అంకితం చేసిన రోజు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. లేదంటే అంగారకుడి చెడు ద్రుష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయట. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడుతుంది. మరి మంగళవారం ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మంగళవారం రోజు కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదట. అదేవిధంగా మంగళవారం కొత్త బట్టలు ధరించకూడదు. ఎందుకంటే ఈ రోజు కొత్త బట్టలు ధరిస్తే మంగళకరంగా భావిస్తారు. ఈ రోజు కొత్త బట్టలు ధరించడం వల్ల ఇతర కారణాల చేత ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. ఈ రోజు ధరించిన కొత్త వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తుంటారు. అప్పు తీసుకోవద్దట. శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిగిరి చెల్లించడం కష్టం అవుతుందని మంగళవారం అప్పు పొరపాటున కూడా చేయకూడదు.

 

అలాగే హెయిర్ కట్ మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులు చేస్తే ఆయుష్షు తగ్గిపోతుందని విశ్వసిస్తూ ఉంటారు. అలాగే మంగళవారం షేవింగ్ చేయడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది.
మంగళవారం ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మంగళవారం మసాజ్ చేసుకుంటే తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి. ఫలితంగా ఎన్నో వ్యాధులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంట్లో చికాకులు కూడా మొదలవుతాయి..శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తువులతో పాటుగా కొత్త బూట్లను కూడా ధరించకూడదు. కొత్త బూట్లు వేసుకోవడం వల్ల గాయాలపాలవుతారు. అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో మంటలు, దొంగతనం జరిగే ప్రమాదం ఉంటుందని భావిస్తారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్పమయ్యే అవకాశం ఉంటుంది. .

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -