Apple Tea: వామ్మో.. యాపిల్ టీతో అన్ని రకాల ప్రయోజనాలా?

Apple Tea: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు. చాలామంది వెయిట్ లాస్ అవ్వడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారు. వర్క్ ఔట్ లు, ఎక్సర్ సైజ్ లు, రకరకాల చిట్కాలను పాటించినప్పటికీ బరువు తగ్గడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ, లెమన్ టీలు కూడా తగ్గుతున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అలా ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదు అని బాధ పడేవారు ఈ ఆపిల్ తో తయారు చేసిన టీని తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

యాపిల్ టీ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. యాపిల్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారట. రోజూ యాపిల్ తినే వ్యక్తిలో గుండె సమస్యలు సులభంగా తగ్గుతున్నాయి. అంతేకాకుండా యాపిల్‌ జ్యూస్‌ ప్రతి రోజూ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే దీనితో తయారు చేసి హెర్బల్‌ టీ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. మరి యాపిల్ టీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

దీని కోసం 2 కప్పుల నీటిని తీసుకుని ఒక పాత్రలో పోసుకుని మంట మీద ఉడికించి అందులో టీ బ్యాగ్, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు మళ్లీ నీటిని మరిగించి, దానిలో యాపిల్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క పొడిని వేసి, టీని ఒక గ్లాసులో వడబోసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
యాపిల్ టీ తాగడం వల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. యాపిల్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి. లూజ్ మోషన్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆపిల్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా సులభంగా పొట్ట సమస్యలు తగ్గుతాయి. యాపిల్ టీని డిటాక్స్ డ్రింక్‌గా కూడా ఉపయోగించవచ్చు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -