Girl Child: ఆడపిల్ల పుడితే 6000 రూపాయలు.. ప్రభుత్వం శుభవార్త ఇదే!

Girl Child: ప్రస్తుత రోజులో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టడం ఒక దరిద్రంగా శాపంగా భావిస్తున్నారు. దారుణం ఏంటంటే మగవారు మాత్రమే కాకుండా చాలా మంది స్త్రీలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు.. ఆడపిల్ల వద్దనుకునే ముందు తాను ఒక సాటి స్త్రీనే కదా అన్న విషయాన్ని చాలామంది మరిచిపోతున్నారు. ఇంకొందరు దుర్మార్గపు తల్లిదండ్రులు ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులో చిదిమేస్తున్నారు. ఇంకొందరు ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పలో పారేయడం చంపి దూరంగా విసిరేయడం లాంటి దారుణాలకు కూడా ఒడిగడుతున్నారు.

అయితే ఆడపిల్ల విషయంలో ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు, పథకాలను అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ తల్లిదండ్రుల ఆలోచన విధానం మాత్రం మారడం లేదు. ఈ విషయంపై కేంద్రం దృష్టి సారించి ఆడ పిల్లలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మిషన్ శక్తి పథకం కింద కొత్త పథకాన్ని తెచ్చింది. రెండో కాన్పులో ఆడపిల్లను కన్న తల్లికి రూ. 6 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరి దీనికి అర్హులెవరు ఎలా నమోదు చేసుకోవాలి అనే వివరాల్లోకి వెళితే.. మిషన్ శక్తి కింద కేంద్రం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ. 6 వేలు ఆర్థిక సాయం అందజేయనుంది.

 

ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన కింద మొదటి కాన్పులో అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా సరే జన్మిస్తే మూడు విడతల్లో రూ. 5 వేలు చెల్లిస్తున్నారు. ఈ ప్రణాళికా వ్యయంలో 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తున్నాయి. ఈ పథకంలో రెండో ప్రసవానికి ఆర్థిక ప్రయోజనం వర్తించలేదు. దానిని ఇప్పుడు సవరిస్తూ రెండో కాన్పులో ఆడపిల్ల పుడితేనే తల్లికి రూ. 6 వేలు ఆర్థిక సాయం ఇచ్చే విధంగా చేశారు. ఒకవేళ రెండో కాన్పులో కవలలు జన్మించినా, వారిలో ఒకరు ఆడపిల్ల అయినా కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ఒక మహిళ మొదటిసారి గర్భం దాల్చిన తర్వాత ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుంటే రూ. 1000 ఇస్తారు. ఆరు నెలల తర్వాత రూ. 2 వేలు, ప్రసవం అయిన 14 వారాలలోపు మరో రూ. 2 వేలు అందజేస్తారు. గర్భిణులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ కాపీలతో 12 వారాల్లోపు దవాఖానలో పేర్లు నమోదు చేసుకుంటే రూ. 5 వేలు దశలవారీగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులకు జనన ధృవీకరణ పత్రం ఆధారాలతో డబ్బులు చెల్లించబడతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -