Mega Fans: మెగా ఫ్యాన్స్ సంతోషానికి కారణమిదే.. బిడ్డకు జన్మనివ్వడంతో?

Mega Fans: మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. తాజాగా ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిన్న అపోలో హాస్పిటల్ లో ఉపాసన జాయిన్ అయిన విషయం తెలిసిందే. తన అత్తయ్య సురేఖ భర్త రామ్ చరణ్ తో కలిసి హాస్పిటల్ కి వెళ్లిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఉపాసన హాస్పటల్ కు వెళ్ళకముందే త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాను అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

అనుకున్నట్టుగానే తల్లి అయింది ఉపాసన. దీంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. మొన్నటికి మొన్న చరణ్ కి పుట్టబోయే బిడ్డ విషయం గురించి తలుచుకుంటూ చిరంజీవి సంతోషంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఉపాసన కోసం తన సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకున్నాడు చరణ్. కొన్ని రోజుల పాటు ఉపాసనతోనే ఉండబోతున్నాడు. అంతేకాకుండా ఉపాసనకు నెలలు నిండే కొద్ది చెర్రీ దగ్గరుండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కాగా ఉపాసన డెలివరీ కోసం ప్రపంచప్రసిద్ధ వైద్యుల్ని సంప్రదించారు.

వాళ్ల పర్యవేక్షణలో ఉపాసన క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ డెలివరీకి సిద్ధమైంది. ఇక ఆ డేట్ వచ్చేసరికి, ప్రత్యేకంగా అపోలో హాస్పిటల్ లో అంతర్జాతీయ వైద్య బృందాన్ని సిద్ధం చేశారు. అలా ది బెస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. రామ్ చరణ్ తండ్రి కావడంతో అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లలో ట్వీట్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -