Tollywood Heroines: సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందు ఈ స్టార్ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా?

Tollywood Heroines: సాధారణంగా చిత్ర పరిశ్రమలో తారలందరూ ఎంతో కష్టపడి పైకి వస్తారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాక ఒక పెద్ద హిట్టు సంపాదిస్తేనే వాళ్లకి తమ పేరుకి మంచి గుర్తింపు దక్కుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీలో హీరోయిన్ల స్టార్ డం ను బట్టి, ప్రతిభను బట్టి కొన్ని పేర్లు హీరోయిన్లే మార్చుకుంటారు. అలా ఇప్పుడు మనం హీరోయిన్ల సొంత పేర్లు పక్కన పెట్టి.. సినిమా పేర్లతో కంటిన్యూ అవుతున్న హీరోయిన్ల గురించి మనం తెలుసుకుందాం.

అనుష్క శెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి.. ఈ ముద్దుగుమ్మది కర్ణాటక.

అప్పటి అందాల భామ సౌందర్య గురించి మనందరికీ తెలిసిందే. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినిమాల్లోకి వచ్చాక తన పేరును సౌందర్య గా మార్చుకుంది.

ఇక అప్పట్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న రోజా గురించి మనందరికీ తెలిసిందే. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆ పేరుతో ఇంతకుముందే ఒక నటి ఉండడంతో రోజా అని ఆమె పేరు పెట్టుకుంది.

టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి అందాల భామ రంభ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విజయవాడలో పుట్టిన రంభ అప్పటి టాలీవుడ్ లో గ్లామర్ క్లీన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక రంభ అసలు పేరు విజయలక్ష్మి.

ఇక రాశి గురించి మనందరికీ తెలిసిందే. రాశి అసలు పేరు మంత్ర. సినిమాల్లోకి వచ్చాక మంత్ర పేరును రాశి గా మార్చుకుంది.

ఇక నయనతార కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఆమెకు సినిమాల్లోకి రాకముందు రెండు పేర్లు ఉన్నాయి. డయానా, కురియన్ ఇక సినీ రంగంలో అడుగు పెట్టిన తర్వాత నయనతార గా పేరు మార్చుకుంది.

ఇక సినీనటి శ్రీదేవి మనందరికీ తెలిసిందే. ఈమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత ఈమె పేరు శ్రీదేవి గా మారిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -