Garuda Purana: ఈ తప్పులు చేస్తే గరుడ పురాణం ప్రకారం దురదృష్టం కలుగుతుందా.. అలా చేయొద్దంటూ?

Garuda Purana: సాధారణంగా మన ఇంట్లో పెద్దలు ఎదుటి వ్యక్తికి తెలిసి తెలియక కూడా అపకారం చేయకూడదని చెబుతూ ఉంటారు. మనం ఏ మంచి చేస్తే మంచి జరుగుతుందని చెడు చేస్తే చెడు జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. మనం ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తే మనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురవుతాయని చెబుతూ ఉంటారు. చాలామంది చాదాస్తాలుగా వాటిని కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే చెడ్డ పనులు చేయడం వల్లే కాకుండా కొన్ని రకాల పనులు చేయడం వల్ల దురదృష్టం కలుగుతుందట. ఇదే విషయాన్ని గరుడ పురాణంలో చెప్పారు.

గరుడ పురాణం ప్రకారం ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా ఎవరైనా చనిపోతే చనిపోయిన తర్వాత, గరుడ పురాణాన్ని పఠించడం వలన ఆ ఆత్మకి శాంతి కలుగుతుందని చెబుతుంటారు. అయితే వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో చేసే ఈ తప్పులు అదృష్టాన్ని తొలగించేసి, దురదృష్టాన్ని కలిగిస్తాయి. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా డబ్బు గురించి గర్వపడకూడదు. అటువంటి ప్రవర్తన మూర్ఖత్వాన్ని తెలుపుతుంది. అలా ప్రవర్తిస్తున్న సమయంలోనే తెలిసి తెలియక ఇతరులను అవమానిస్తూ ఉంటారు.

 

ఏ వ్యక్తిని కించపరచడం, అవమానించడం మంచిది కాదు. లక్ష్మీదేవికి వారిపై ఆగ్రహం కలుగుతుందట. గరుడ పురాణం ప్రకారం, కొందరు దురాశతో ఉంటారు. అలాంటి వారికి కూడా మంచి జరగదు. ఎవరినైనా అవమానించడం, కించపరచడం మహా పాపం అని గరుడ పురాణం చెప్తోంది. ఇతరులను కించపరిచే వారు, ఎప్పుడూ సంతోషంగా ఉండలేరని గరుడ పురాణంలో చెప్పబడింది. మాసిన బట్టలు అస్సలు వేసుకోకూడదు. గరుడ పురాణం ప్రకారం, శుభ్రమైన బట్టలే వేసుకోవాలి. మురికి లేదా మాసిపోయిన బట్టలు వేసుకుంటే, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పేదరికం కలుగుతుంది. కాబట్టి, ఎప్పుడు శుభ్రమైన బట్టలు మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం రాత్రిళ్ళు పెరుగు తినకూడదు. ఇది కూడా చాలా పెద్ద తప్పు అని గరుడ పురాణం లో చెప్పబడింది. కాబట్టి, ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులను చేయకూడదు. ఇటువంటి తప్పులు చేస్తే, సుఖంగా ఉండలేరు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -