Lord Ganesha: గణేషుడి పూజలో తప్పక పెట్టాల్సిన వస్తువులివే.. ఈ విధంగా పూజిస్తే ఎంతో పుణ్యమంటూ?

Lord Ganesha: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి. త్వరలోనే వినాయక చవితి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా ఈ పండుగ పనులలో నిమగ్నమయ్యారు. అయితే ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 18వ తేదీ లేదా 19 వ తేదీ జరుపుకోవాల అనే ఆయోమయంలో ఉన్నారు. ఈ విషయం గురించి పండితులు ఇదివరకే తెలియజేస్తూ 18వ తేదీ వినాయక చవితి పండుగ జరుపుకోవాలని వెల్లడించారు. మరి 18వ తేదీ వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో వినాయకుడికి ఎలా పూజ చేయాలనే విషయాల గురించి తెలుసుకుందాం.

వినాయకుడికి పూజలో మనం ఎన్నో రకాల పండ్లను నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాము. అయితే ఎన్ని పెట్టినప్పటికీ పూజలో మాత్రం ఈ రెండు లేకపోతే ఆ పూజ ఎప్పటికి ఆ సంపూర్ణంగానే ఉంటుందని చెప్పాలి. మరి వినాయకుడి పూజలు తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే.. వినాయకుడి పూజలు తప్పనిసరిగా ఉండాల్సింది గరిక. గరిక అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం అందుకే వినాయకుడి పూజలు తప్పనిసరిగాక ఉంచాలని ఇది లేకపోతే పూజ అసంపూర్ణమవుతుందని పండితులు చెబుతున్నారు.

ఇక గరికితో పాటు వినాయకుడికి ఎంతో ప్రీతి కరమైనటువంటి వాటిలో కుడుములు, ఉండ్రాళ్లు కూడా ఒకటి. అందుకే వినాయకుడి పూజలు ఇవి రెండు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. వీటితోపాటు మనకు నచ్చిన ఆహార పదార్థాలను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక వినాయక చవితి రోజు స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం వల్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. తద్వారా మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తారు. అందుకే వినాయకుడికి తప్పనిసరిగా ఎర్రని పుష్పాలతో పూజ చేయడం ఎంతో అవసరం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -