Bumper Offer: వధువులకు బంపర్ ఆఫర్.. 25 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటే రివార్డ్ ఇస్తామంటూ?

Bumper Offer: ఒకప్పుడు జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి చైనా జనాభా రేటు పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా జననాల సంఖ్య తగ్గిపోవడంతో చైనా ప్రభుత్వం జనాభాను పెంచడం కోసం యువతీ యువకులను ప్రోత్సహిస్తూ సరికొత్త స్కీమ్స్ అమలులోకి తెస్తుంది.ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని చాలామంది యువతీ యువకులు పెళ్లిళ్లు చేసుకోకుండా అలాగే తమ జీవితాన్ని గడుపుతున్నారు ఇలా చేయటం వల్ల జననాల రేటు జనాభా రేటు పూర్తిగా తగ్గిపోయింది.

ఈ క్రమంలోనే చైనాలోని జెజియాంగ్ రాష్ట్రం జనాభా రేటు పెరుగుదలకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలోని యువతీ యువకులు 25 సంవత్సరాల లోపు వివాహం చేసుకొని పిల్లల్ని కంటే వారికి పెద్ద ఎత్తున రివార్డులను ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు..చైనాలో వివాహ వయసు అబ్బాయిలకు 22 అమ్మాయిలకు 20గా ఉంది. దీంతో 25 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసులో ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకుంటే వారికి నగదు ప్రోత్సాహం అందించనున్నారు.

 

మొదట 25 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకునే వారికి ఏకంగా 1000 యువాన్లు అందించబోతున్నారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వారి చదువుల విషయంలోనూ అలాగే సంరక్షణ విషయంలోను పెద్ద ఎత్తున సబ్సిడీలను ప్రకటిస్తూ ఆర్థికంగా సహాయం చేయబోతున్నట్లు తెలిపారు. ఇలా చైనా దేశంలోని జనాభాను పెంచే దిశలోని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. 2021 తో పోలిస్తే 2022లో వివాహాలు చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గిపోయిందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -