Inspiring journey of Harika: అప్పుడు దర్జీ కూతురు.. ఇప్పుడు జడ్జీ.. ఈ యువతి సక్సెస్ స్టోరీ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!

Inspiring journey of Harika: పట్టుదల ఉండాలి కానీ సాధించలేనిది అంటూ ఏదీ లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కృషి పట్టుదల సంకల్పం ఇవన్నీ ఉంటే అనుకున్నది సాధించడం పెద్ద సంగతి ఏమీ కాదు అనే మన పెద్దలు, గురువులు చెబుతూ ఉంటారు. చాలామంది విద్యార్థులు వాటిని నిజమని నిరూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక విద్యార్థిని కూడా తన తండ్రి ఆశయాలను నెరవేర్చింది. ఇంతకీ ఆమె ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. లక్ష్మయ్య, స్వరూప దంపతుల ముగ్గురు కుమార్తెల్లో ఒకరు. లక్ష్మయ్య దర్జీ పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. ఆ సమయంలో ఇంటి పక్కనే ఒక కోర్టు ఉండేది.

అయితే అక్కడికి వచ్చే న్యాయవాదులు, న్యాయమూర్తులను చూసి తన కూతుళ్లలో ఒకరిని న్యాయమూర్తిని చేయాలనుకున్నారట. ఈలోగా సింగరేణి సంస్థలో బదిలీ ఫిల్లర్‌ కార్మికుడిగా ఉద్యోగం దొరికింది. దాంతో 20ఏళ్లపాటు గోదావరిఖనిలో పనిచేశారు. తర్వాత ఇల్లెందు ఏరియాలో వంట కార్మికుడిగా నియమించడంతో తిరిగి స్వస్థలానికి చేరారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిన ఆయన వారు బాగా చదువుకోవాలని తపన పడేవారు. తండ్రి ఆలోచనకు తగ్గట్టుగానే వారిలో హారిక చిన్నతనం నుంచీ చదువుల్లో చురుకు. ఆమె విద్యంతా గోదావరిఖని, కొత్తగూడెంలో జరిగింది.

ఆపై బీఏ ఎల్‌ఎల్‌బీ కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. గిరిజన ప్రాంతమైన ఇల్లెందు చరిత్రలో ఇప్పటివరకు న్యాయమూర్తిగా ఇక్కడివారెవరూ ఎంపిక కాలేదు. హారిక ఈ ఘనత సాధించారు. 2022లో జేసీజే నోటిఫికేషన్‌ రావటంతో రాత్రీపగలూ శ్రమించారు. వేలమంది రాసిన ఈ పరీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హారిక న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. వరంగల్‌ థర్డ్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై తండ్రి కోరిక నెరవేర్చిందిహారిక.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -