Aakasa Veedhullo Review: ‘ఆకాశ వీధుల్లో’ మూవీ రివ్యూ

విడుదల తేదీ: సెప్టెంబర్‌–2, 2022
నటీనటులు : గౌతమ్‌ కృష<, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్‌ అయ్యంగార్, హర్షిత గౌర్‌ తదితరులు
నిర్మాతలు : మనోజ్‌ జెడి, డా. డీజే మణికంఠ
దర్శకత్వం: గౌతం కృష్ణ
సింగీతం:జూడా శాండి
సినీమాటోగ్రఫి: విశ్వనా«థ్‌ రెడ్డి
ఎడిటర్‌: శశాంక్‌ నాగరాజు

Aakasa Veedhullo Movie Review and Rating

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడు, హీరోగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్‌ 2న థియేటర్లలో విడుదలైన ‘ఆకాశ వీధుల్లో‘ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తోందో చూద్దాం..

కథ: దేవి ప్రసాద్‌ , సంధ్యల(బాల పరాశర్‌) కొడుకైన సిద్ధు (గౌతమ్‌ కృష్ణ్ణ) చదువులో వెనుక బడుతుండటంతో తండ్రి దేవీ ప్రసాద్‌ మనది సాధారణ కుటుంబం.. నువ్వు చదువుకుంటేనే సమాజం విలువ ఇస్తోందని బాగా చదువుకోవాలని చెబుతుంటాడు. అయితే ఒక రోజు సిద్ధు తన తండ్రితో నాకు చదువు మీద ఆసక్తి లేదు, మ్యూజిక్‌ అంటే ఇష్టం ఉంది.నేను మ్యూజిక్‌ మీద కాన్సెంట్రేట్‌ చేస్తాను అంటాడు. దాంతో ఎంతో ఇష్టంగా దగ్గరుండి తయారు చేయించుకొన్న సిద్దు గిటార్‌ తండ్రి పగలగొట్టడంతో సిద్ధు ఇంట్లో నుంచి∙బయటకు వెళ్లి పోతాడు.

అక్కడ చాలా మంది అమ్మాయిలను చూసినా కలగని ఇష్టం నిషా (పూజితా పొన్నాడ )ను చూసి ఇష్టపడతాడు.కొన్నాళ్ల తర్వాత నిషాతో మనం లివింగ్‌లో ఉందామని సిద్ధు చెప్పగా లవ్‌ రిలేషన్స్‌ మీద నమ్మకం లేదు అంటుంది నిషా. తన మాటను కాదన్న కోపంతో సిద్దు డ్రింక్‌ చేస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడతాడు. ఎంత చెప్పినా వినని సిద్ధుతో విసిగిపోయిన నిషా నువ్వు నన్ను సిన్సియర్‌ గా లవ్‌ చేస్తే నా జోలికి రాకు అని బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోతోంది.

దాంతో సిద్ధు మరింత డ్రగ్స్‌ ఎడిక్టర్‌గా మారాతాడు. దాంతో ఫ్రెండ్స్‌ అందరూ నువ్వు ఇలా ఉంటే రాక్‌స్టార్‌ అవ్వాలనే కల ఎలా నెరవేరుతోందని అంటారు .ఎవరు ఎన్ని చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్న సిద్ధు తన గర్ల్‌ఫ్రెండ్‌ నిషా ప్రేమను తిరిగి పొందగలిగాడా లేదా? సామాన్యుడైన టీనేజ్‌ అబ్బాయి సిద్ధు రాక్‌ స్టార్‌ ఎలా అయ్యాడు? అనేది తెలుసు కోవాలంటే థియేటర్‌ కు వెళ్లి సినిమా చూడాల్సిందే!

నటీ నటుల పనితీరు: సిద్ధు (గౌతమ్‌ కృష్ణ)కు ఇది మొదటి సినిమా అయినా సీనియర్‌ యాక్టర్‌ చాలా చక్కగా నటించాడు. అటు రొమాంటిక్‌ పాత్ర.. ఇటు రాక్‌ స్టార్‌ పాత్రలో రెండు షేడ్స్‌ వున్న పాత్రలలో ఒదిగిపోయాడు. నిషా(పూజిత పొన్నాడ)తన లుక్స్‌తో పాటు రొమాంటిక్‌ సీన్స్‌ లో యూత్‌ ను ఆకట్టుకుంటుంది. స్క్రీన్‌పై సిద్ధు, నిషాల కెమిస్ట్రీ బాగా వర్క్‌ఔట్‌ అయింది. సిద్దు తండ్రిగా దేవి ప్రసాద్‌ సాధారణ మధ్య తరగతి తండ్రిగా చాలా బాగా నటించాడు.

నిషా తండ్రిగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కూడా తనదైన శైలిలో పాత్రలో మునిగిపోయాడు. సిద్దుకు తల్లిగా నటించిన సంధ్య (బాల పరాశర్‌), చెల్లిగా సిందు (దివ్య నార్ని) లు సెంటిమెంట్‌ పాత్రలను బాగా పండించారు. ఫ్రెండ్స్‌ పాత్రలో నటించిన ఆనంద్‌ (రిషి),సత్యం రాజేష్‌ లు తన నటనతో ఆకట్టుకున్నారు . మీర్జాపూర్‌ ఫెమ్‌ హర్షిత గౌర్‌ స్పెషల్‌ అప్పిరియన్స్‌ గా అలరించారు.

విశ్లేషణ: ప్రస్తుత యంగ్‌స్టర్స్‌ ఎలా ఉంటున్నారు వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. మనలో మనకు జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది.,కుటుంబంలోని పెద్దల ఆలోచనలు ఎలా వుంటాయి అనే కొత్త కాన్సెప్ట్‌ తో దర్శకుడు గౌతమ్‌ Mకృష్ణ చాలా చక్కగా తెరకెక్కించాడు. కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు.ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.జూడా శాండీ చక్కటి మ్యూజిక్‌ ఇచ్చారు. ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటకు చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, సింగర్‌ కాల భైరవ చాలా బాగా పాడారు.

ఇంకా సిద్‌ శ్రీరామ్‌ పాడిన అయ్యొయ్యో అనే పాట యువత ను ఆకట్టుకొనేలా ఉంది.ఇందులో రాహుల్‌ సిప్లిగంజ్, రాహుల్‌ రామకృష్ణ, చిన్మయిలు పాడిన పాటలు బాగున్నాయి. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు మంచి సాహిత్యాన్ని అందించారు. విశ్వనా«థ్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్‌ గా నిలుస్తుంది. శశాంక్‌ నాగరాజు ఎడిటింగ్‌ బాగుంది .డ్రాగన్‌ ప్రకాష్‌ ఫైట్స్‌ రియలిస్టిక్‌ ఉన్నాయి. నిర్మాతలు మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠలు ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈసినిమా ఉంటుంది.‘ఆకాశ వీధుల్లో‘ సినిమా అన్ని వయసుల వారిని కచ్చితంగా అలరిస్తోందని చెప్పవచ్చు.

రేటింగ్‌:3.5

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -