Gautham Krishna: బిగ్ బాస్ చరిత్రలోనే సంచలనం.. ఆ నిర్ణయం తీసుకున్న గౌతమ్ విజేత కావడం ఖాయమా?

Gautham Krishna: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఊహించని ట్విస్టులతో ముందుకి సాగిపోతుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎప్పుడు కెప్టెన్ అవుతున్నారు అర్థం కాకుండా ఉంది. మొత్తానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.అలాగే ఈవారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకి దూసుకుపోతుంది బిగ్ బాస్. కెప్టెన్ గౌతమ్ కృష్ణ ఈవారం బాగా హైలైట్ అయ్యాడు. అతను తీసుకున్న ఒక నిర్ణయం అతనిని హైలెట్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఎనిమిదో వారం కెప్టెన్సీ కోసం ఐదుగురు కంటెంట్లు పోటీపడ్డారు. అయితే గౌతమ్ కృష్ణ అందరి మద్దతు కూడగట్టుకొని కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు.

కెప్టెన్ అయిన తర్వాత అతను ఎలాంటి రూల్స్ చేస్తాడో అని అందరిలోని క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఎవరి ఊహకి అందని విధంగా అతను నిర్ణయాలు తీసుకొని అందరి మన్ననలు పొందాడు. ఇంతకీ అతను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటంటే తనకు డిప్యూటీలుగా లేడీ కంటెస్టెంట్లు రతికా రోజ్,శోభ శెట్టి ని తీసుకొని ఆడవాళ్ళ పట్ల అతనికి ఉన్న గౌరవాన్ని చూపించుకున్నాడు. అలాగే అతను తీసుకున్న మరొక ఊహించని నిర్ణయం ఏమిటంటే ప్రతి ఇంట్లోని ఆడవాళ్ళు రకరకాల పనులు చేస్తూ, ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటారు.

ఇంటి బాధ్యతలను చూసుకోవడంలో స్త్రీలదే అప్పర్ హ్యాండ్ అన్నాడు. ప్రతి ఇంట్లో ఉన్న, టీవీ చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఫిమేల్ వీక్ జరుపుకుందాం, ఇందుకోసం ఈవారం అంతా లేడీస్ కి హాలిడేస్ ఇస్తున్నా అని తెలిపాడు. దీంతో అతని నిర్ణయాన్ని అందరు మెచ్చుకొని ఓకే చెప్పారు. అలాగే ఇంకొక డెసిషన్ కూడా అతనిని బిగ్బాస్ చరిత్రలో సంచలనానికి కేంద్రంగా మార్చింది.

అదేమిటంటే ప్రతిరోజు లైట్స్ ఆఫ్ అయిన తర్వాత పని గురించి నిర్ణయం ఉంటుంది. ఆ రోజు ఎవరైతే ఎక్కువ కష్టపడ్డారో వాళ్ళకి కష్టజీవి అని బిరుదు, తక్కువ వర్క్ చేసిన వాళ్ళకి పని దొంగనే బిరుదు ఇస్తాము. కష్టజీవికి ఒక డ్రింక్ నేను ఇస్తాను,అలాగే పని దొంగ తన రెండు గుడ్లను కష్టజీవికి ఇవ్వాలి అని చెప్పాడు. అయితే దీనికి కొందరు అభ్యంతరం తెలపడంతో నా మాటే శాసనం అంటూ ఫన్నీగా చెప్పి అందరి నోర్లు మూయించాడు. ఇతని కెప్టెన్సీ విధానం చూస్తుంటే ఇతను విజేత కావటం ఖాయం అనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -